కృష్ణ

వేసవిలో నీటి ఎద్దడి తప్పేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 15: సమీపిస్తున్న వేసవిలో మంచినీటి ఇబ్బందులు తప్పవా అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోంది. వేసవిలో మంచినీటి రానివ్వకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా సమస్యను మాత్రం ఏ మేర పరిష్కరించలేకపోతున్నారు. పట్టిసీమ ద్వారా వచ్చే కొద్దిపాటి నీటితో జిల్లా వాసుల దప్పిక తీర్చేందుకు అధికారులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగక ముందే జిల్లాలో ఉన్న మంచినీటి చెరువుల్లో నీటి మట్టాలు తగ్గు ముఖం పడుతున్నాయి. భూగర్భజలాల సైతం అడుగంటిపోతున్న నేపథ్యంలో రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉంటుందోనన్న భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 400 చెరువుల ద్వారా ప్రజలు తమ దాహార్తి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ చెరువుల్లో ఉన్న నీటి నిల్వలు మరో పది పదిహేను రోజులకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం కావల్సి ఉంది. సహజంగా వేసవి నెల రోజుల ముందు ఆర్‌డబ్ల్యుయస్ శాఖాధికారులు కార్యాచరణ రూపొందించే వారు. కానీ నేడు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి నెల ప్రారంభమైన పక్షం రోజులకే నీటి నిల్వలు తగ్గిపోవటం అధికారులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించేలా చేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాల పెరుగుదల ఆశాజనకంగా లేదు. గత ఏడాది మాదిరిగానే పులిచింతల ప్రాజెక్టే మంచినీటి అవసరాలను తీర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండవ పంట దాళ్వాను సైతం పక్కన పెట్టి కేవలం మంచినీటి అవసరాల కోసమే పులిచింతలలో నీటి నిల్వలు నిలిపారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని పులించింతల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఏడాది రెండు పర్యాయాలు పులిచింతల ద్వారా మంచినీటిని విడుదల చేశారు. నీటి చౌర్యాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖల అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగానే చెప్పవచ్చు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నీటి చౌర్యం జరుగుతుందనడంలో కూడా అతిశయోక్తి లేదు.