విజయవాడ

పాలనలో దూకుడు పెంచిన మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: నగర పాలనలో మేయర్ కోనేరు శ్రీ్ధర్ దూకుడు పెంచారు. గురువారం సాయంత్రం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పలు సెక్షన్లను స్వీయ పరిశీలన చేసిన మేయర్, ఆఫీస్ ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రతలపై అధికార, సిబ్బందిపై మండిపడ్డారు. తొలుత ఆఫీస్‌లో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్ ఆయా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సాయంత్రం 6 గంటల వరకూ పలువురు సిబ్బంది ఆఫీస్‌లోనే ఉండి ముచ్చట్లాడుకుంటూ కొందరు, ఫైల్స్ తిరగేస్తూ మరికొందరు కనిపించిన తీరుపై అసహనం వ్యక్తం చేసిన మేయర్ గోడలకు క్యాలెండర్లు, యూనియన్ల పోస్టర్లు, దేవుళ్ల చిత్ర పటాలను అంటించిన తీరుతోపాటు టేబుళ్లపై చిందర వందరగా ఉన్న వివిధ ఫైల్స్, ఇతర డాక్యుమెంట్ల తీరుపై మండిపడ్డారు. తక్షణమే సాధారణ టేబుల్స్‌ను తొలగించి డెస్క్‌లతో కూడిన ఫర్నీచర్‌ను ఏర్పాటుచేసి క్రమ పద్దతిలో కార్యాలయాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈ శ్రీనివాసరావును ఆదేశించారు. అలాగే యూనియన్ క్యాలెండర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇటువంటి మరోసారి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలావుండగా కొద్దిరోజులుగా వీఎంసీలో మేయర్, కార్పొరేటర్ల మధ్యనే కాకుండా మేయర్, అధికార సిబ్బంది మధ్య నెలకొన్న వివిధ వివాదాలతో వీఎంసీ అట్టుడికిన వైనంతో స్థబ్ధత నెలకొన్న నగర పాలనతో మేయర్ శ్రీ్ధర్ ఆకస్మిక తనిఖీలను నిర్వహించి తన దూకుడు పెంచడంపై ఉద్యోగులలో చర్చనీయాంశమైంది.