రాష్ట్రీయం

షార్‌లో రెడ్ అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 24: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరించడంతో ప్రధాన నగరాలతో సహా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం (సతీష్ థావన్ స్పేష్ సెంటర్) షార్‌లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో సహా పోలీసులు, కోస్టల్ గార్డులచే సముద్ర మార్గాన కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. షార్‌లోని ప్రధాన గేటుతో సహా రెండో ద్వారం వద్ద కూడా లోపలకు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. సూళ్లూరుపేటలో కూడా రైల్వేస్టేషన్, లాడ్జీల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్సై గంగాధర్ తెలిపారు.