నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ దనుజారి నావంటి దాసజాలము నీకు
కోటి సంఖ్య గలుగ కొదువలేదు
బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్యమహిమ చేత
దండిగా భృత్యులు దగిలి నీకుండంగ
బక్క మంటే పాటి పనికివచ్చు?
నీవు మెచ్చెడి పనుల్ నేను చేయఁగ లేక
ఇంత వృథా జన్మమెత్తినాను.

తే॥ భూజనులలోన నేనప్రయోజకుఁడను
గనుక, నీ సత్కటాక్షంబు గలుగఁజేయు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ స్వామీ! రాక్షసవీరోధీ! నీకు లెక్కలేనంత మంది భక్తులున్నారు. నీ సిరిసంపదలు మరియు బంట్ల బలం చాటున నన్ను మరచిపోవద్దు. నీకు సేవకులెందరో! ఈ పేదభృత్యుని వల్ల నేవౌతుంది? నీవు మెచ్చే పనులేవి చేయలేని నిష్ప్రయోజన జన్మనాది. ఈ జనంలో నేను వట్టి అప్రయోజకుణ్ణి. అందువల్ల నీవు దయతో చూడు.