సంపాదకీయం

‘ఉడాయించడం’ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరస్థులు విదేశాలకు సకాలంలో ‘ఉడాయించడానికి’ వీలుగా చక్కటి వ్యవస్థ ఏర్పడి ఉండడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు సంక్రమించిన ప్రత్యేక లక్షణం! ‘నేరం’ బద్దలయి దేశవ్యాప్తంగా ప్రకంపనాలు కలిగే సమయానికి కొద్ది రోజుల ముందుగా నేరం చేసిన ‘ఘరానా’లు దేశం నుంచి చల్లగా జారుకొని ఉండడం దశాబ్దుల చరిత్ర. పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏళ్ల తరబడి కొల్లగొట్టిన నీరవ్ మోదీ అనే వాణిజ్య బీభత్సకారుడు ‘సకుటుంబ సపరివారం’గా దేశం నుంచి నిష్క్రమించగలడం సరికొత్త నిదర్శనం. భౌతిక బీభత్సకారులు, బౌద్ధిక బీభత్సకారులు, వాణిజ్య బీభత్సకారులు నేరం బయటకు పొక్కేలోగా దేశం వదిలి వెళ్లిపోవడం మన దేశంలో దశాబ్దుల చరిత్ర. ఇలా ‘విచారణ’లో ‘నిర్బంధానికి’ గురికాకుండా పలాయనం చిత్తగిస్తున్న పేరుమోసిన నేరస్థులలో స్వదేశీయులున్నారు, విదేశీయులున్నారు! నీరవ్ మోదీ స్వదేశీయుడా? విదేశీయుడా? అన్నది ఇక ఎప్పటికీ తేలదు. ఎందుకంటే ఇతగాడు గత కొద్ది నెలలుగా బెల్జియం దేశానికి చెందిన ‘ప్రయాణ అనుమతి పత్రం’- పాస్‌పోర్ట్ ప్రాతిపదికగా వివిధ దేశాల నుంచి ‘ప్రవేశ అనుమతి పత్రం’- వీసా పొందగలిగాడు! మన విదేశ మంత్రిత్వ కార్యాలయం వారు ఇప్పుడు నీరవ్ మోదీ ‘ప్రయాణ అనుమతి పత్రాన్ని’ రద్దు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ఈ వాణిజ్య బీభత్సకారునికి గత కొన్ని నెలలుగానో, కొన్ని ఏళ్లుగానో మనదేశం ‘పాస్‌పోర్ట్’తో పాటు బెల్జియం ‘పాస్‌పోర్ట్’ కూడా ఉందన్నమాట! భారతీయ సంతతికి చెందిన విదేశీయులకు ‘ద్వంద్వ సభ్యత్వం’ కల్పించడమన్న ఆధికారిక అవకాశం నీరవ్ మోదీ విషయంలో ఇలా ‘సార్థకమైందన్న’ మాట! బెల్జియం పౌరసత్వం ఉన్నదంటే బెల్జియం పాస్‌పోర్ట్ అతడికి దక్కి ఉంటుంది! మనదేశపు పాస్‌పోర్ట్ కూడా ఇంతవరకు రద్దు కాలేదు. ఇప్పుడు రద్దయినందున నీరవ్ మోదీకి జరుగనున్న నష్టం ఏమీ లేదు. బెల్జియం పాస్‌పోర్ట్‌ను చూపించి అతగాడు ప్రపంచమంతటా తిరుగుతూ ఉండగలడు- మన దేశానికి రాడు! పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఒక ‘ముంబయి శాఖ’లో ఈ అవినీతి దళారీగాడు, వజ్రాల వ్యాపారి ముసుగు వేసుకున్నవాడు దాదాపు ఆరేళ్లపాటు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను దోచుకోగలడం ‘స్థానిక అవినీతి’.. ఆ శాఖ- బ్రాంచి- అధికారులు కొంతమంది పైవారు ఈ అవినీతిలో భాగస్వాములయి ఉండవచ్చు. కానీ అతగాడు నేరాల పుట్ట పగిలే లోగా దేశ సరిహద్దులను దాటుకోగలగడం స్థానిక నేరం గాదు, ‘జాతీయ’ స్థాయి ‘వ్యవస్థ’ సహకారానికి ఇది తిరుగులేని సాక్ష్యం..
వారెన్ ఆండర్సన్ అనే అమెరికావాడు 1984లో భోపాల్ నుంచి విమానమెక్కి పారిపోయిననాటి నుంచి ఇదే కథ నడుస్తోంది! ఒట్టావియో కుత్రోచీ, ఎమ్‌ఎఫ్ హుస్సేన్, విజయ్ మాల్యా, జకీర్ నాయక్ వంటి ఘరానా నేరస్థులు న్యాయస్థానాలలోను బయట అభియోగాలకు, ఆరోపణలకు గురి అయ్యే సమయానికి వారు మనదేశంలో లేరు. ఇలా నేరస్థులు నిష్క్రమించడం, నిష్క్రమించగలగడం మన ప్రభుత్వాల ‘నిఘా’ వ్యవస్థలలో నిహితమై ఉన్న దశాబ్దుల వైపరీత్యం. నిఘా వ్యవస్థ ఉలిక్కి పడేసరికి నేరస్థులు కనిపించరు. వారిని విదేశాల నుంచి రప్పించడం లేదా పట్టి తెప్పించటం మన ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవడం మరో వైచిత్రి! ఈ ‘వైవిధ్య’ బీభత్సకారులు సుఖంగా జీవిస్తున్న దేశాలు మనకు మిత్ర దేశాలుగా పేరు మోశాయి. పాకిస్తాన్ వంటి శత్రుదేశం నుంచి, జిహాదీ ముఠాలను ఉసిగొల్పుతున్న దేశం నుంచి దావూద్ ఇబ్రహీం వంటి నరరూప రాక్షసులను మనం తరలించుకొని రాలేకపోవచ్చు! బ్రిటన్ నుంచి విజయ్ మాల్యా అనే వాణిజ్య బీభత్సకారుడిని, సౌదీ అరేబియా నుంచి జకీర్ నాయక్ అనే జిహాదీ ఉగ్రవాదిని కూడా మనం తరలించుకొని రాలేకపోవటం ప్రజలకు అంతుపట్టని ప్రభుత్వ రహస్యం! ఎమ్‌ఎఫ్ హుస్సేన్ అనే బౌద్ధిక బీభత్సకారుడు మనదేశంలో పుట్టి పెరిగినవాడు. తల్లి అయిన భరతమాతను, చదువుల తల్లి సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రించిన ఈ మాతృ ద్రోహికి, దేశద్రోహికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో అనేక అభియోగాలు దాఖలయ్యాయి. కానీ అతగాడు దర్జాగా దేశం నుంచి నిష్క్రమించి ‘ఖతార్’ అన్న దేశంలో చేరిపోయాడు. ఆజీవనం అక్కడే జీవించాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘యూనియన్ కార్బయిడ్’ అన్న అమెరికా సంస్థకు చెందిన ఎరువుల కర్మాగారం నుంచి 1984 డిసెంబర్‌లో విష రసాయన వాయువు వెలువడింది, అధికార గణాంకాల ప్రచారం 3,787 మంది అకాల మరణం పొందారు. విషవాయువుల మృతుల సంఖ్య దాదాపు పదహైదు వేలు అని 2014లో ప్రచారమైంది. ఈ ఘోరం జరిగిన మరుసటి రోజున ‘యూనియన్ కార్బయిడ్’ అధిపతి వారెన్ ఆండర్సన్ భోపాల్‌లో ప్రత్యేక విమానమెక్కి ఢిల్లీలో దిగాడు. వెంటనే మరో విమానంలో అమెరికా వెళ్లిపోయాడు! కేంద్ర ప్రభుత్వ అధికార పర్యవేక్షణలోనే ఆండర్సన్ దేశం నుంచి ఉడాయించడం ధ్రువపడిన చారిత్రక వికృతి! ‘జనం ఆండర్సన్‌ను కొట్టి చంపేస్తారన్న’ భయంతో ప్రభుత్వం భోపాల్ నుంచి ఢిల్లీకి ఈ ‘క్రూర నిర్లక్ష్య’ నేరస్థుడిని తరలించిందట! కానీ అతగాడిని ఢిల్లీలో నిర్బంధించకుండా ఎందుకు అమెరికాకు పంపేశారు? అతడు సురక్షితంగా అమెరికాకు చేరుకున్న తరువాత అతనిపై ఆరోపణలు, అభియోగాలు దాఖలయ్యాయి. కొనే్నళ్లుపాటు ప్రభుత్వాలు ఆండర్సన్ సంగతి మరచి పోయాయి! న్యాయస్థానాలు కొరడా ఝుళిపించడంతో ఇరవై ఏళ్ల తరువాత గుర్తుకు వచ్చింది. కానీ 2014లో తొంబయి రెండవ ఏట మరణించేవరకు ఆండర్సన్ అమెరికాలో ‘రహస్య స్థలం’లో హాయిగా జీవించాడు. అతగాడిని దేశానికి రప్పించడానికి ముప్పయి ఏళ్లపాటు వీలు కలగలేదు. 1980వ దశకం రెండవ భాగంలో బయటపడిన బోఫోర్స్ అవినీతి సూత్రధారి ఒట్టోవియో కుత్రోచి ఇటలీ దేశస్థుడు. అతగాడిని మలేసియా నుంచి, అర్జెంటీనా నుంచి మన ప్రభుత్వం రప్పించలేకపోయింది. ‘అంతర్జాతీయ నిఘా మండలి’- ఇంటర్ పోల్ పోలీసులు 2007లో అర్జెంటీనాలో కుత్రోచీని నిర్బంధించారు. కానీ మన ప్రభుత్వమే అతనిపై అభియోగాన్ని రద్దు చేసింది..!
ఇదీ ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్ పేరుతో ఏర్పడి ఉన్న అంతర్జాతీయ అవినీతి అనుసంధానం. ఆర్థిక పరమైన ఘోరాలు జరిగిపోతున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు నిర్లజ్జగా, నిర్భయంగా అంతర్జాతీయ యాత్రలు చేస్తున్నారు. నీరవ్ మోదీ భార్య అమీ మోదీకి అమెరికా పౌరసత్వం ఇదివరకే లభించింది. అతగాడి సోదరుడు నిశాల్ మోదీ బెల్జియం దేశ పౌరుడు. నీరవ్ మోదీకి ఎన్ని దేశాల పౌరసత్వం ఉన్నదీ నిర్థారణ కాలేదు. ఇదీ వారి అవినీతి ప్రపంచ కుటుంబం. ‘సరిహద్దులు’ చెరిగిపోయాయి!