క్రీడాభూమి

మహిళల క్రికెట్ చెలరేగిన మిథాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్ట్ లండన్, ఫిబ్రవరి 16: ఐదు మ్యాచ్‌ల టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌ని భారత్ 9 వికెట్ల తేడాతో గెల్చుకుంది. చెలరేగిపోయిన మిథాలీ రాజ్ 61 బంతుల్లోనే అజేయంగా 76 పరుగులు సాధించి, భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. మొదటి టీ-20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన భారత మహిళలు ఇప్పుడు రెండో మ్యాచ్‌ని కూడా తమ ఖాతాలో వేసుకొని, సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగలిగింది. సనే లుస్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నాడిన్ కాప్ 26 పరుగులు సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్ ఆ మాత్రం స్కోర్లు కూడా చేయలేకపోయారు. అనుజా పాటిల్ 37 పరుగులకు రెండు, పూనమ్ యాదవ్ 18 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. పూజా వస్ట్రాకర్, శిఖా పాండే చెరొక వికెట్ సంపాదించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మిథాలీ, స్మృతి మందానా అద్భుత ప్రారంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 106 పరుగులు జోడించిన తర్వాత మొసెలినా పనీల్స్ బౌలింగ్‌లో ఎల్‌బిగా ఔటైన స్మృతి 42 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (7 నాటౌట్)తో కలిసి మిథాలీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడింది. 61 బంతులు ఎదుర్కొని 76 పరుగులు చేసిన ఆమె స్కోరులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. కాగా, ఈ సిరీస్‌లో మిగతా మూడు టీ-20లు వరుసగా 18 (జొహానె్నస్‌బర్గ్), 21 (సెంచూరియన్), 24 (కేప్ టౌన్) తేదీల్లో జరుగుతాయి.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 (సనే లుస్ 33, నాడిన్ కాప్ 26, అనుజా పాటిల్ 2/37, పూనమ్ యాదవ్ 2/18).
భారత్ మహిళల ఇన్నింగ్స్: 19.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 144 (మిథాలీ రాజ్ 76 నాటౌట్, స్మృతి మందానా 57, హర్మన్‌ప్రీత్ కౌర్ 7 నాటౌట్).