క్రీడాభూమి

విదేశాల్లోనూ పులులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 16: స్వదేశంలో పులులు.. విదేశాల్లో పిల్లులు అని ముద్ర వేయించుకున్న భారత్ ఇప్పుడు విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లి, టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకొని, విదేశాల్లోనూ పులేనని నిరూపించింది. అయితే, అపురూమైన, చిరస్మరణీయమైన విజయాలు గతంలోనూ లేకపోలేదు. 2002 నాట్‌వెస్ట్ టోర్నీని గెల్చుకున్నప్పుడు, అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ మైదానం బాల్కనీలో షర్టు విప్పేసి కేరింతలు కొట్టిన సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు వరకూ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను కూడా చిత్తుచేసినప్పటికీ, విదేశాల్లో పసలేని ఆటతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేది. చివరికి జింబాబ్వే వంటి దేశాల్లో పర్యటించినా, విజయాల కోసం ముఖం వాచిపోయేది. ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, నాట్‌వెస్ట్ సిరీస్‌లో భారత్‌పై అంతా 3అండర్ డాగ్2 ముద్ర వేశారు. శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లు బరిలో ఉండడంతో, టీమిండియా పోరాటం గ్రూప్ దశకే పరిమితమవుతుందని ఊహించారు. కానీ, అందరి అంచనాలకు విరుద్ధంగా భారత్ ఫైనల్ చేరింది. 3క్రికెట్ మక్కా2 లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ (115), ఓపెనర్ మార్కస్ ట్రెస్క్థోక్ (109) సెంచరీలతో చెలరేగిపోయారు. దీనితో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 325 పరుగులు సాధించింది. పదునైనింగ్లాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన భారత్ ఒకానొక దశలో 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, యువరాజ్ సింగ్ (69), మహమ్మద్ కైఫ్ (87 నాటౌట్) భారత్‌కు అంగా నిలిచారు. టెయిలెండర్ హర్భజన్ సింగ్ సైతం ఇంగ్లాండ్ బౌలింగ్‌కు ఎదురునిలిచి 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. చివరి ఓవర్ మూడో బంతికి భారత్ విజయాన్ని నమోదు చేసింది. 49.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 326 పరుగులు సాధించి, రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి నాట్‌వెస్ట్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, 1983 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ (అప్పట్లో 60 ఓవర్ల ఫార్మాట్) తర్వాత భారత క్రికెట్ జట్టు సాధించిన అతి గొప్ప విజయంగా నాట్‌వెస్ట్ టోర్నీని పేర్కోవాలి.
పాకిస్తాన్ టూర్ (2004)
ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన సిరీస్‌ల్లో 2004 పాకిస్తాన్ టూర్‌ను తప్పక ప్రస్తావించాలి. అంతకు ముందు, 1989లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినప్పుడు, భారత్ లెంజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ తెండూల్కర్, పాకిస్తాన్ సూపర్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం తమతమ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. సహజంగానే ఇరు దేశాల మధ్య రాజకీయ వైరుధ్యాలు, నిరంతర యుద్ధ వాతావరణం నెలకొని ఉండడంతో, ఆ సిరీస్‌పై అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా కరాచీలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ని భారత్ 5 వికెట్ల తేడాతో గెల్చుకుంది. అయితే, ఆతర్వాత ఎదురుదాడికి దిగిన పాకిస్తాన్ వరుసగా రెండు వనే్డల్లో విజయాలను నమోదు చేసి, 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. నాలుగో మ్యాచ్‌లో తిరిగి భారత్ గెలిచింది. దీనితో చివరిదైన ఐదో వనే్డ అత్యంత కీలకంగా మారడంతో, లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో యుద్ధ వాతావరణం కనిపించింది. వివిఎస్ లక్ష్మణ్ సూపర్ సెంచరీ (107)కి, అప్పటి యువ బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్, లక్ష్మీపతి బాలాజీ నిప్పులు చెరిగే బౌలింగ్ భారత్‌కు 40 పరుగుల తేడాతో విజయాన్ని అందించాయి.
కామనె్వల్త్ బ్యాంక్ సిరీస్ (2008)
యువ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 2007లో సెలక్షన్ కమిటీ పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అయితే, టీ-20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్‌తోపాటు, స్వదేశంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై వనే్డ సిరీస్‌ను ధోనీ అందించడంతో, అతని పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోయింది. మరుసటి సంవత్సరం, 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామనె్వల్త్ బ్యాంక్ సిరీస్ ఆడేందుకు ధోనీ బృందం వెళ్లింది. అంతకు ముందు ఒక్క ముక్కోణపు వనే్డ సిరీస్‌ను కూడా గెల్చుకోలేకపోయిన టీమిండియాకు శ్రీలంక కూడా పోటీపడిన ఆ సిరీస్‌లో సవాలుగా మారింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లను కూడా ఓడించిన భారత్, పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. విజేతను నిర్ధారించడానికి బెస్ట్ఫా త్రీ ఫైనల్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయాలను నమోదు చేసింది. 1998లో కోకాకోలా కప్‌ను జట్టు గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన సచిన్ తెండూల్కర్ ఈ రెండు ఫైనల్స్‌లోనూ అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. మొదటి ఫైనల్‌లో 117, రెండో ఫైనల్‌లో 91 చొప్పున పరుగులు చేశాడు. దీనితో భారత్ తొలి ఫైనల్‌లో ఆరు వికెట్లు, రెండో ఫైనల్‌లో 9 పరుగుల తేడాతో విజయాలు సాధించింది.
వెస్టిండీస్‌లో ట్రై సిరీస్ (2013)
చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకొని మంచి ఊపుమీద ఉన్న టీమిండియా ట్రై సిరీస్‌ను ఆడేందుకు వెస్టిండీస్ వెళ్లింది. అక్కడ విజయపరంపరలను కొనసాగిస్తుందని ఆశించిన అభిమానులకు తొలుత నిరాశే మిగిలింది. విండీస్, శ్రీలంక జట్ల చేతిలో మొదటి రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. శ్రీలంకకు బోనస్ పాయింట్ కూడా లభించిందంటే, భారత్ వైఫల్యాన్ని ఊహించుకోవచ్చు. రేసులో నిలవడానికి చివరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచి, బోనస్ పాయింట్లు సంపాదించాల్సి ఉండగా, అద్వితీయ పోరాట ప్రతిభను కనబరచిన టీమిండియా చెలరేగిపోయింది. వెస్టిండీస్‌ను చిత్తుచేసి బోనస్ పాయింట్‌ను సంపాదించింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్ చేరింది. భారత్ కూడా ఫైనల్‌లోకి అడుగుపెట్టడంతో, పోరు ఉత్కంఠను పెంచింది. 202 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 152 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ టెయిలెండర్లతో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. చివరి ఆరు ఓవర్‌లో 15 పరుగులు అవసరంకాగా, ధోనీ దాడికి ఉపక్రమించాడు. షామింద ఎరాంగ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించి, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు విజయాన్ని అందించాడు. గ్రేట్ ఫినిషర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు.
ఇంగ్లాండ్ టూర్ (2014)
అంతకు ముందు ఇంగ్లాండ్‌లో ఏడు పర్యాయాలు పర్యటించినప్పటికీ, ఒక్కసారి ద్వైపాక్షిక సిరీస్‌ను కూడా గెల్చుకోలేకపోయిన టీమిండియా 2014లో మరోసారి అక్కడ పర్యటించింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకోవడంతో, వనే్డ సిరీస్‌పై అభిమానులు ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, ఆతర్వాత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 6 వికెట్లు, 133 పరుగులు, 9 వికెట్ల తేడాతో విజయాలు సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది. లీడ్స్‌లో జరిగిన ఎలాంటి ప్రాధాన్యం లేని చివరి వనే్డలో ఓడినప్పటికీ, భారత క్రికెటర్లు, ముఖ్యంగా యువ ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్‌పై వనే్డ సిరీస్ విజయాన్ని సుసాధ్యం చేశారు.
ఇప్పుడు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో మరెవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను అందుకుంది. దక్షిణాఫ్రికాను వారి సొంత గడ్డపై మొదటిసారి ఓడించింది. వనే్డల్లోగాక, మరే ఇతర ఫార్మాట్‌లోనూ లభించని విజయాన్ని మొదటిసారి అందించింది. టీమిండియా విదేశాల్లోనూ పులేనని ఈ వనే్డ సిరీస్ స్పష్టం చేసింది.