క్రీడాభూమి

టీ-20 ఇంటర్నేషనల్స్‌లో ఆస్ట్రేలియా ‘రికార్డు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఫిబ్రవరి 16: డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌ను ఢీకొన్న ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. టీ-20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 244 పరుగులు సాధించాల్సి ఉన్నప్పటికీ, ఏ మాత్రం తడబాటు లేకుండా, 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరింది. మార్టిన్ గుప్టిల్ సెంచరీ చేసినప్పటికీ, న్యూజిలాండ్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుప్టిల్ 54 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 105 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కొలిన్ మున్రో 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, మరో ఆరు సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. వీరి విజృంభణతో కివీస్‌కు భారీ స్కోరు సాధ్యమైంది. కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై చెరి రెండు వికెట్లు కూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మొదటి నుంచే వ్యూహాత్మకంగా దాడులకు ఉపక్రమించింది. వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆర్సీ షార్ట్ మొదటి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 59 పరుగులు చేసిన తర్వాత ఇష్ సోధీ బౌలింగ్‌లో వార్నర్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ లిన్ (18), గ్లేన్ మాక్స్‌వెల్ (31) వేగంగా పరుగులు రాబట్టడానికి కృషి చేశారు. కాగా, 44 బంతుల్లోనే 76 పరుగులు (8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసిన షార్ట్‌ను టిమ్ సీఫెర్ట్ క్యాచ్ అందుకోగా ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. మార్కస్ స్టొయినిస్ నాలుగు పరుగులకే వెనుదిరగ్గా, ఆరోన్ ఫించ్ (36 నాటౌట్) ఆసీస్‌ను విజయపథంలో నడిపించాడు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 245 పరుగులు చేయగా, ఫించ్‌తోపాటు అలెక్స్ కారే (1) క్రీజ్‌లో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ తలా ఒక్కో వికెట్ కూల్చారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 243 (మార్టిన్ గుప్టిల్ 105, కొలిన్ మున్రో 76, కేన్ రిచర్డ్‌సన్ 2/40, ఆండ్రూ టై 2/64).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 245 (డేవిడ్ వార్నర్ 59, ఆర్సీ షార్ట్ 76, గ్లేన్ మాక్స్‌వెల్ 31, ఆరోన్ ఫించ్ 36 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 1/42, టిమ్ సౌథీ 1/48, ఇష్ సోధీ 1/35, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 1/56).