క్రీడాభూమి

కోహ్లీ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 16: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన చివరి, ఆరో వనే్డ ఇంటర్నేషనల్‌లోనూ కొనసాగింది. కెరీర్‌లో 35వ శతకాన్ని సాధించిన అతను టీమిండియాను విజయపథంలో నడిపాడు. తొలిసారి దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను గెల్చుకున్న భారత్, 5-1 తేడాతో సిరీస్‌ను ముగించింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 107 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 2 వికెట్లు కోల్పో య ఛేదించింది. కోహ్లీ 129, అజింక్య రహానే 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, భారత్‌కు సునాయాస విజయాన్ని అందించారు.
భారత కెప్టెన్ కోహ్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను హషీం ఆమ్లా (10) రూపంలో కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ పట్టగాఅతను ఔటయ్యాడు. మరో ఓపెనర్, కెప్టెన్ అయిడెన్ మర్‌క్రామ్ 30 బంతుల్లో 24 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే శ్రేయాస్ అయ్యర్‌కు చిక్కాడు. 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ఆదుకునేబాధ్యతను స్వీకరించిన ఏబీ డివిలియర్స, ఖయా జొన్డో స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించారు. 34 బంతుల్లో 30 పరుగులు చేసిన డివిలియర్స్‌ను యుజువేంద్ర చాహల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ హెన్రిక్ క్లాసెన్ (22), ఫర్హాన్ బెహర్దిన్ (1), క్రిస్ మోరిస్ (4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, దక్షిణాఫ్రికాను ఆదుకోవడానికి విశేషంగాపోరాడిన జొన్డో 74 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. చివరిలో అండిల్ ఫెహ్లూక్వాయో (34), మోర్న్ మోర్కెల్ (20) కొద్దిసేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించారు. ఇమ్రాన్ తాహిర్ రెండు పరుగులకే ఔట్‌కావడంతో, 46.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 204 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ 52 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్ చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 32.1 ఓవర్లలో రెం డు వికెట్లు కోల్పోయ గమ్యాన్ని చేరింది. విరాట్ కోహ్లీ 129, అజింక్య రహానే 34 పరు గులతో నాటౌట్‌గా నిలిచారు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: అయిడెన్ మర్‌క్రామ్ సి శ్రేయాస్ అయ్యర్ బి శార్దూల్ ఠాకూర్ 24, హషీం ఆమ్లా సి ధోనీ బి శార్దూల్ ఠాకూర్ 10, ఏబీ డివిలియర్స్ బి యుజువేంద్ర చాహల్ 30, ఖయా జొన్డో సి హార్దిక్ పాండ్య బి యుజువేంద్ర చాహల్ 54, హెన్రిచ్ క్లాసెన్ సి విరాట్ కోహ్లీ బి జస్‌ప్రీత్ బుమ్రా 22, ఫర్హాన్ బెహర్డీన్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి శార్దూల్ ఠాకూర్ 1, క్రిస్ మోరిస్ సి శిఖర్ ధావన్ బి కుల్దీప్ యాదవ్ 4, అండిల్ ఫెహ్లూక్వాయో సి అండ్ బి శార్దూల్ ఠాకూర్ 34, మోర్న్ మోర్కెల్ సి శ్రేయాస్ అయ్యర్ బి హార్దిక్ పాండ్య 20, ఇమ్రాన్ తాహిర్‌సి విరాట్ కోహ్లీ బి జస్‌ప్రీత్ బుమ్రా 2, లున్గీ ఎన్గిడి 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (46.5 ఓవర్లలో ఆలౌట్) 204.
వికెట్ల పతనం: 1-23, 2-43, 3-105, 4-135, 5-136, 6-142, 7-151, 8-187, 9-192, 10-204.
బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 8.5-0-52-4, జస్‌ప్రీత్ బుమ్రా 8-1-24-2, హార్దిక్ పాండ్య 10-0-39-1, కుల్దీప్ యాదవ్ 10-0-51-1, యుజువేంద్ర చాహల్ 10-0-38-2.
భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ సి ఖయా జొన్డో బి లున్గీ ఎన్గిడి 18, రోహిత్ శర్మ సి హెన్రిచ్ క్లాసెన్ బి లున్గీ ఎన్గిడి 15, విరాట్ కోహ్లీ 129 నాటౌట్, అజింక్య రహానే 34 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 206.
వికెట్ల పతనం: 1-19, 2-80.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 7-0-42-0, లున్గీ ఎన్గిడి 8-1-54-2, క్రిస్ మోరిస్ 6-0-36-0, అండిల్ ఫెహ్లూక్వాయో 4-0-27-0, ఇమ్రాన్ తాహిర్ 7.1-0-42-0.