బిజినెస్

రూ. 15వేల కోట్లతో విమానాశ్రయాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, ఫిబ్రవరి 16:దేశంలోని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించడం, కొత్తగా నిర్మించడమే లక్ష్యంగా ఆ ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ. 15వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లు, భవనాలను మరింత సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించిట్లు ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర తెలిపారు. ఇందుకోసం 15వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ‘ఏర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సిక్కింలోని పాక్యాంగ్‌లో 650 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన విమానాశ్రయంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజూ విమానాశ్రయాల నిర్మాణం పూర్తయిందని ఆయన చెప్పారు. ఈ రెండు విమానాశ్రయాల్లో త్వరలో ప్రయాణీకులకు సేవలు అందిస్తాయని చెప్పారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధి తీరును ఆయన ఈ సందర్భంగా వివరించారు. పశ్ఛిమ ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విమానాశ్రయాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించనున్నామని, నవీముంబయిలో నిర్మించనున్న విమానాశ్రయం పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు. అలాగే గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మించాలన్న ప్రణాళిక పరిశీలనదశలో ఉందని చెప్పారు. గోవాలోని మోపాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు సాగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అదేతరహా విమానాశ్రయం నిర్మించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. కోల్‌కతా, చెన్నైలలో రెండో విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, అలహాబాద్‌లోని ప్రస్తుత విమానాశ్రయాన్ని రూ. 100 కోట్ల వ్యయంతో పెద్దఎత్తున విస్తరిస్తున్నామని మహాపాత్ర చెప్పారు. వచ్చే ఫిబ్రవరికల్లా ఈ పనులను రెండు దశల్లో పూర్తి చేస్తామని చెప్పారు.