హైదరాబాద్

రోడ్ల నిర్మాణానికి జర్మన్ టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: నగరం మహానగరంగా రూపాంతరం చెందినా కొత్త వేస్తున్న రోడ్లు త్వరగా దెబ్బతినకుండా కొంతకాలం ప్రజలకు అందుబాటులో ఉండేలా జీహెచ్‌ఎంసీ వేయలేకపోతోంది. ఇందుకు పనిలో నాణ్యత, ఇంజనీర్లలో కొరవడిన నైపుణ్యతకు అవినీతి కూడా తోడైందన్న అపవాదును సైతం జీహెచ్‌ఎంసీ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో రోడ్ల నిర్మాణం నాణ్యతతో పాటు ప్రజలకు కొంతకాలం అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రోడ్ల నిర్మాణానికి జర్మన్ టెక్నాలజీని వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమైంది. ఈ టెక్నాలజీ ప్రకారం సిమెంటు, ఇతర రసాయన పదార్థాలను కలిపి రూపొందించిన మిశ్రమం ద్వరా రోడ్లను నిర్మించే సరికొత్త ప్రక్రియను అవలంభిస్తోంది. ‘స్టెబిలైజేషన్ రోడ్ బై రీ సైక్లింగ్ విత్ ఎడిషన్ సిమెంట్ అండ్ అదర్ కెమికల్స్ అనే టెక్నాలజీతో తొలుత నెక్లెస్‌రోడ్డులో ప్రయోగాత్మకంగా నిర్మాణాన్ని చేపట్టింది. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్డు నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ పనులను చేపడుతున్నారు. మామూలు బీటీ రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయమే ఈ ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న రోడ్డుకు సరిపోతోంది. ఒక్కో కిలోమీటరకు రూ. 55లక్షల నుంచి రూ. 65 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశమున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. రీ రోడ్డు నిర్మాణంలో వైట్ టాపింగ్ రోడ్ల మాదిరిగానే దాదాపు పది సంవత్సరాల పాటు నాణ్యత ఉంటుందని కూడా తెలిపారు.