హైదరాబాద్

వేడుకగా సీఎం జన్మదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: లాల్‌బహదూర్ స్టేడియంలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధీకార సంస్థ (శాట్స్) కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, ఏక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు విచ్చేసి కేక్ కట్ చేసి వేడులను ప్రారంభించారు. శాట్స్ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్ రెడ్డితో పాటు గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ మమత సంతోష్ గుప్తా పాల్గొన్నారు.
వనస్థలిపురం: ఎల్బీగనర్‌లోని పలు ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహంచారు. ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ చైర్మెన్ జోగు రాములు ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రేత్యక పూజలు నిర్వహించారు.అనంతరం రాజీవ్ గాంధీనగర్,్భరత్ నగర్ మురికివాడలలో నివాసం ఉంటున్న పేదలకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతలు సమీర్, గౌరి, లక్ష్మయ్య, అశోక్, శేఖర్ పాల్గొన్నారు.
ఉప్పల్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) బోడుప్పల్ పురపాలక సంఘం కమిటీ ఆధ్వర్యం లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించా రు. జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి నా యకత్వంలో టీఆర్‌ఎస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి చర్ల ఆంజనేయులు, పులకండ్ల జంగారెడ్డి, ఎంపీటీసీలు జ యమ్మ, జంగమ్మ, శోభ, శారద, నేతలు బొమ్మక్ బాలయ్య, నత్తి ప్రతాప్‌రెడ్డి, సదానందం, కిషన్, వెంకటేశ్, మైస య్య, మల్లేష్, జంగయ్య, యాదగిరి, గీతారెడ్డి, కనకదుర్గ, రజని, అనితా రె డ్డి, యువజన విభాగం ఉప్పరి విజ య్, దర్శన్, వంశీకృష్ణ, తిరుపతి యా దవ్ వందలాది మంది పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహంచౌరస్తాలో కేక్ కట్‌చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అక్కడి నుంచి ప్రతాప్‌సింగారంలోని ఎమ్మెల్యే ఇంటివరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్: ముఖ్యమంత్రి కేసీఆర్ 64వ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రగతిభవన్‌లో కలెక్టర్ ఎంవీ రెడ్డి పుష్పగుచ్ఛాన్ని అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.