కృష్ణ

మన ‘గృహాలు’ దేశానికి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో నిర్మాణం అవుతున్న గృహాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పట్టణంలో నిర్మితమవుతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాలకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎంఎల్‌సి టీడీ జనార్ధన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాంలతో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే కాక అన్ని వసతులతో కూడిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు గృహలు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. 17 నెలల్లో 38వేల కోట్ల రూపాయలతో సుమారు 5లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతొందన్నారు. జగ్గయ్యపేటలో 236కోట్లతో రెండు విడతలుగా 3924 ఇళ్లు నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు. 4లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చి నిర్మాణం చేపట్టే ఈ గృహాలపై లబ్ధిదారులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, నిర్మాణ సమయంలో వారు స్వయంగా పరిశీలించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామన్నారు. 15వేల ఇళ్లు ఇప్పటికే గృహ ప్రవేశాలు పూర్తి అయ్యాయన్నారు. ఎంఎల్‌సీ టిడి జనార్ధన్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, తొలుత దివంగత నేత ఎన్‌టిఆర్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే నేడు చంద్రబాబు అధునాతన సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తన అధ్యక్ష ఉపన్యాసంలో ఆదర్శవంతంగా చేపట్టిన గృహ నిర్మాణాలతో ప్రతి పేదవాడు సౌకర్యాలతో కూడిన ఇంటిలో నివసించే అవకాశం ముఖ్యమంత్రి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ జగ్గయ్యపేట చరిత్రలోనే ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా పేర్కొన్నారు.

పేదలపై రుణ భారం తగ్గించండి
కాగా మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల కోసం చదరపు అడుగుకు 1000లు మాత్రమే ఖర్చు అవుతుందని తెలుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలుగా నిర్ణయించడంతో మిగిలిన వెయ్యి పేదలకు భారం మారుతుందని అన్నారు. సభ సందర్భంగా నేతలకు మున్సిపాలిటీ తరపున చైర్మన్ రాజగోపాల్ సత్కరించారు. ఈ సభలో వైస్ చైర్మన్ అక్బర్, ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవేంద్రరావు, జిల్లా తెలుగుమహిళ ఆచంట సునీత, మాజీ చైర్మన్‌లు శ్రీరాం సుబ్బారావు, ఎంవి చలం, కమిషనర్ రమేష్, తహశీల్దార్ నర్శింహారావు, కౌన్సిల్ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. యువనేత శ్రీరాం ధనుంజయ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.