కృష్ణ

ఉందిలే మంచికాలం ముందుముందున!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 17: సాంకేతిక విద్యదే ఉజ్వల భవిష్యత్తు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 20వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ఆవరణలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఉమ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని వీటి ద్వారా విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగాలని, ఇంటర్ పెన్యూర్‌షిప్‌ను సద్వినియోగించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి టెక్నాలజీ కోసం ఎదురు చూడకుండా తానే టెక్నాలజీని తయారు చేసుకునే స్థాయికి ఎదిగి సమాజాన్ని మార్చాలన్నారు. మన ఆలోచనలే మనకు పెట్టుబడి అని మనకున్న యూత్ ఫోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేదని, గ్లోబల్ ఎకానమీ, లోకల్ ఎకానమీ కలిపి గ్లోకల్ ఎకానమీగా తయారై అద్భుతాలు సృష్టించాలన్నారు. భావి ఇంజనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్ళకుండా ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుని ఇక్కడే అభివృద్ధి చేయాలన్నారు. సాంకేతిక రంగం ద్వారానే అనేక పధకాలను అమలు చేస్తున్నామని, వ్యవసాయం, సాగునీటి రంగాలలో టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. సకాలంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పధకంతో కృష్ణా, పశ్ఛిమగోదావరి జిల్లాలలో దాదాపు ఏడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించటంతోపాటు ఆయా ప్రాంతాలలోని గ్రామాలకు తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యను క్రమశిక్షణతో అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే కాక దేశస్థాయిలో గుర్తింపు పొందిన లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల రాబోయే రోజులలో డీమ్డ్ యూనివర్శిటీగా రూపాంతరం చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ లకిరెడ్డి బాలిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసభలో ప్రవాసాంధ్రులు లకిరెడ్డి హనిమిరెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ ప్రసాద్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, గోగులమూడి సత్యనారాయణరెడ్డి, కె తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి ఉమ బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
వామపక్ష పోరాటాలు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

మైలవరం, ఫిబ్రవరి 17: ఓట్లున్నా లేకపోయినా, సీట్లు గెలిచినా గెలవకపోయినా ప్రజాసమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేయటమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు స్పష్టం చేశారు. రైతు సంఘం జిల్లా మాజీ కార్యదర్శి, మైలవరం మాజీ సర్పంచ్, ప్రజావైద్యులు దివంగత సూరానేని విజయ సారధిరావు కాంస్య విగ్రహాన్ని స్థానిక నూజివీడురోడ్‌లోని మహాత్మాగాంధీ గ్రంధాలయం ఎదుట శనివారం మధు ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సీపీఎం వారి పక్షాన నిలబడి పోరాటాలు చేసి అనేక కేసులలో నిందితులుగా తమ పార్టీ నిలబడిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో గత ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన విభజన హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినా దానికి మిత్రపక్షమైన తెలుగుదేశం మొసలి కన్నీరు కారుస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా పోరాడుతున్నామని ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే తొలుత తామే బంద్‌కు పిలుపునివ్వటం జరిగిందన్నారు. విభజన హామీలను ఒక్కదానిని కూడా అమలు చేయకుండా కేంద్రం రాష్ట్రంపై కక్ష కట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్యాకేజీకే సంతృప్తి చెందినా ఇంత వరకూ అనుకున్న ప్యాకేజీ ఇవ్వకపోయినా వౌనంగా ఉండటం ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బిఆర్ తులసీరావు, రైతుసంఘం రాష్ట్ర నేత వై కేశవరావు, జిల్లా కమిటీ సభ్యులు పివి ఆంజనేయులు, డివి కృష్ణ, రావూరి రామారావు, టిడిపి నేతలు ధనేకుల బుల్లిబాబు, శోభన్‌బాబు, రమేష్ బాబు, చలవాది మల్లిఖార్జునరావు, ఎండి జాని తదితరులు పాల్గొని ఎస్వీ సారధిరావుతో తమకున్న అనుబంధాన్ని, చేసిన పోరాటాలను వివరించారు.

‘జెక్‌ఫెస్ట్’ ఉర్రూతలూగించిన సినీ సంగీత విభావరి

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 17: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న జెక్‌ఫెస్ట్-2018 వేడుకలు విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నిర్వహించిన సినీ సంగీత విభావరి విద్యార్థి లోకాన్ని సంగీత ప్రపంచంలో ముంచెత్తింది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మనో, సునీతలతో కూడిన బృందం విద్యార్థులతో ఆడిపాడి సందడి చేశారు. మనో, సునీతలతో పాటు గాయనీ గాయకులు శ్రీసింహా, మధుప్రియ, అనుదీప్, రమ్య, బెహర చేసిన సంగీత సంవాదం వీక్షకులను ఆకట్టుకుంది. గాయనీ గాయకులను కళాశాల చైర్మన్ డా. వల్లూరి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. వివిధ అంశాలపై సాంకేతిక పత్రాల సమర్పణ, పవర్‌పాయింట్ ప్రజంటేషన్, ఉపన్యాసం, పోస్టర్స్ ప్రజంటేషన్, మోడల్ కాంటెస్ట్, రోబోరేస్, టెక్నికల్ క్విజ్ వంటి పోటీలు నిర్వహించగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంకేతిక పత్రాల సమర్పణ అంశంలో ఇసీఇ విభాగం నుండి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాల, మెకానికల్ విభాగంలో వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, ఎంబీఎ విభాగంలో కృష్ణా విశ్వ విద్యాలయం, ఆంధ్ర లయోలా కళాశాల, ఐటీ విభాగంలో పివిపి సిద్దార్ధ, డీఎన్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలు, త్రిబుల్ ఇ విభాగంలో పివిపి సిద్దార్ధ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలు, సీఎస్‌ఇ విభాగంలో గ్లువల్లేరు, ఆల్‌జివికెటి (నూజివీడు) కళాశాలలు, సివిల్ విభాగంలో సెయింట్ ఆన్స్ (చీరాల), గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో ఇసీఇ విభాగంలో మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుడ్లవల్లేరు కళాశాలలు, మెకానికల్ విభాగంలో స్వర్ణాంధ్ర, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, ఐటీ విభాగంలో గుడ్లవల్లేరు, పివిపి సిద్దార్ధ, ఇఇఇ విభాగంలో వాసవీ ఇంజనీరింగ్, గుడ్లవల్లేరు, సీఎస్‌ఇ విభాగంలో అమృత సాయి, విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు, సివిల్ విభాగంలో పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఓంగలు, అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలు ప్రథమ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. సాంకేతిక నమూనాల పోటీల్లో ఇసీఇ విభాగం నుండి చీరాల ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రధమ, ద్వితీయ స్థానాలను సాధించగా మెకానికల్ విభాగాల్లో ప్రధమ, ద్వితీయ స్థానాలను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఒక్కటే కైవసం చేసుకోవడం విశేషం. ఐటీ విభాగంలోనూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలే తొలి రెండు స్థానాలను దక్కించుకుంది. ఇఇఇ విభాగంలో ఉషారమా ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల, సీఎస్‌ఇలో విష్ణు మహిళా కళాశాల, ప్రథమ స్థానం, సివిల్ విభాగంలో డీఎమ్‌ఎస్‌ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధమ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఆధునిక బృంద నృత్య పోటీల్లో బిఐఇటి భీమవరంకు ప్రథమ స్థానం, గుడ్లవల్లేరుకు ద్వితీయ స్థానం, సంగీత పద్యాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల కైవసం చేసుకుంది. మెకానికల్ విభాగంలో నిర్వహించిన రోబోరేస్ పోటీల్లో ఉషారమా ఇంజనీరింగ్ కళాశాలకు ప్రథమ, వికెఆర్, విఎన్‌బి ఇంజనీరింగ్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. టెక్నికల్ క్విజ్ పోటీల్లో గుడ్లవల్లేరుకు ప్రథమ, విఆర్ సిద్దార్ధకు ద్వితీయ స్థానాలు లభించాయి. పోటీ విజేతలను కళాశాల చైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కరస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డా. పొట్లూరి రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. బి కరుణ కుమార్ అభినందించారు.