శ్రీకాకుళం

ఎన్నికల్లో సరైన వ్యక్తులను ఎన్నుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 17: ఎన్నికల సమయంలో అభ్యర్ధులు ఎన్నికల కమీషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో అభ్యర్ది ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు తెలియజేయాలని, అప్పుడు ప్రజలకు అభ్యర్ధిపై అవగాహన ఏర్పడి సరైన వ్యక్తులను ఎన్నుకునే అవకాశం కలుగుతుందని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. తన నివాస గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది అభ్యర్ధులు అఫిడవిట్‌లు పరిగణనలోనికి తీసుకుంటే అనతికాలంలోనే చిన్న ఆస్తులు ఉన్నవారు వందల కోట్లకు చేరుతున్నారని దీనికి కారణం రాజకీయ అవినీతి అని స్పష్టం అవుతుందన్నారు. కొంతమంది రాజకీయ అవినీతి పరుల వలన వ్యవస్థ మీదే ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుందని, ప్రజాస్వామ్యానికి ప్రజా విశ్వాసం అవసరమన్నారు. ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు కలిగి ఉన్న ఉద్యోగస్తులపై ప్రయోగిస్తున్న చర్యలు రాజకీయ వేత్తలపై కూడా ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రాజకీయ అవినీతిని పట్టించుకోకపోతే చివరికి అది ప్రజాస్వామ్య వ్యవస్థ అని విద్వాంసానికి, మాఫియా పాలనకు దారి తీస్తుందనడం సమస్య తీవ్రతని ప్రజలు అర్థం చేసుకోవచ్చునన్నారు. ఇప్పటికే ఈ విషయంలో చర్యలు పూర్తిస్థాయిలో లేకపోవడం వలన రాజకీయ వ్యవస్థ బ్రష్ఠుపడుతుందని దీని వలనే దేశంలో అన్ని రంగాల్లో అవినీతి పెచ్చుమీరిపోతుందని పేర్కొన్నారు. రాజకీయ అవినీతి విషయంలో మార్పు రావాలంటే ప్రజలతో పాటు ముఖ్యంగా యువత ముందుకు రావాలని అవినీతి రాజకీయ వేత్తలు భరతం పట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రధాన విజయరామ్, గొర్లె కృష్ణారావు, కెల్ల కొండలరావు, బుర్రా ప్రసాద్, సురకాశి వెంకటరావు, విభూది సూరిబాబు, గంగు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఛలో విజయవాడను జయప్రధం చేయాలి
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 17: విద్యుత్‌కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 19న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రధం చేయాలని సిటు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక విజయానంద భవన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఫిబ్రవరి 20 నుండి జరుగు సమ్మె సన్నాహ సదస్సులోవారు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరూ అతితక్కువ వేతనంతో దుర్భరజీవితాలు అనుభవిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోనికి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ హామీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు 23వేల మంది ఉన్నారని వారందరినీ సంస్థలో విలీనం చేసుకుని డిపార్ట్‌మెంట్ నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. తెలంగాణాలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేసిందని ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే రూ.20లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 20 నుండి జరిగే సమ్మె సందర్భంగా అన్ని విద్యుత్ ఉపకేంద్రాల్లో సమ్మె శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యవేదిక జిల్లా చైర్మన్ నర్తు గణపతిరావు అధ్యక్షతన జరిగిన సదస్సులు సిటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, ఐక్య వేదిక కన్వీనర్ పి.దేవీప్రసాద్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదర్శనరావు, రమణమూర్తి, తిరుపతిరావు, చలపతి, పి.రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

బీసీ రెసిడెన్సియల్ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 17: మండలంలోని పెదపాడు పంచాయతీ పరిధిలో రూ.14.9కోట్లతో నిర్మిస్తున్న జ్యోతీరావుపూలే బీసీ రెసిడెన్సియల్ పాఠశాల భవనాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ ఈ భవనాలు అనుకున్న సమయానికి అందించే రీతిలో పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్లు సమస్యలు ఉన్నాయని, అవి ఆర్డివోకు తెలియజేసి పరిష్కరించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తరగతులు నిర్వహించే విధంగా అన్ని పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఈకార్యక్రమంలో పెదపాడు మాజీ సర్పంచ్ కలగ శివ, బొట్ట కామరాజు, ఎస్సీ కార్పొరేషన్ డి ఇ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలకు పూర్వవిద్యార్థ్ధి రూ.3 లక్షల విరాళం
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 17: ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆడిటోరియం పునర్నిర్మాణానికి పూర్వవిద్యార్ధి, కళా హాస్పిటల్ అధినేత డా.పైడి వెంకటరమణమూర్తి రూ.3లక్షల చెక్కును శనివారం ప్రిన్సిపల్ ఎం.బాబూరావు చేతికి విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ కన్నతల్లి లాంటి తన స్వగ్రామమైన కింతలి గ్రామాభివృద్ధికి తనవంతు సహాయం అందించానని , అలాగే తనకు విద్యాబుద్దులు నేర్పి తన ఉన్నతికి మూలమైన డిగ్రీ కళాశాలకు హృదయపూర్వకంగా ఈ విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. పూర్వవిద్యార్ధులు సౌజన్యంతో ఆడిటోరియం పునరుద్దరణకు పూర్వవిద్యార్ధిగా విరాళం ఇవ్వడం సంతోషమన్నారు. భవిష్యత్‌లో కళాశాల అభివృద్ధికి తనవంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనలాంటి వారిని ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి డిగ్రీ కళాశాల తోడ్పడిందని, ఎందరోపేదవిద్యార్ధులు కళాశాలలో చదువుకు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అలాగే వసతులను సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ సిసి అధికారి పోలినాయుడు, పైడితల్లి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్ధులు వెంటరమణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.

నిరుద్యోగులను మోసగించిన టీడీపీ
* వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 17: రాష్ట్రంలో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోనికి వచ్చిన టీడీపీ నిరుద్యోగులను మోసగించిందని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు , మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోతెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే ప్రతీ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగికి రూ.2వేలు చొప్పున భృతి ఇస్తామన్న చంద్రబాబు కనీసం ఒక ఉద్యోగాన్నైనా ఇవ్వలేదన్నారు. వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ను బలహీనపరిచి విద్యార్ధులకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం విధానాలతో యువత ఘోరంగా నష్టపోయిందని దీనిని దృష్టిలో ఉంచుకుని యువత భవిత కోసం యూత్‌ర్యాలీలను వైసీపీ నిర్వహిస్తుందన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆ హోదా సాధించడం కోసం వైసీపీ నేత జగన్ గల్లీ నుండి ఢిల్లీవరకు పోరాటాలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా తమ ఎంపీలను సైతం రాజీనామా చేసేందుకు సిద్ధం చేశారన్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్ర పురోభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిశాంతి మాట్లాడుతూ ఎన్నికలలో 600 హామీలను గుప్పించిన చంద్రబాబు 3కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆశించిన నిరుద్యోగ యువతకు నిరాశను మిగిల్చిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని అధికార పార్టీ నిర్లక్ష్యాన్ని వైసీపీ నిలదీస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు.
* 22న దగాపడ్డ యువత మేలుకో ర్యాలీ
ఈ నెల 22న ఉదయం 9గంటల నుండి జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువతతో కలిసి వైసీపీ ఆధ్వర్యంలో ‘దగాపడ్డ యువత మేలుకో’ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వైసీపీ యూత్‌వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏడురోడ్ల జంక్షన్ వద్దగల వై ఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ర్యాలీని ప్రారంభిస్తామని పాతబస్టాండ్, జిల్లా పరిషత్ మీదుగా ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంటుందన్నారు. అనంతరం నిరుద్యోగ యువత సమస్యలపై వైసీపీ నేతలు ప్రసంగించనున్నారన్నారు. ఈ ర్యాలీకి రాష్ట్ర యూత్‌వింగ్ అధ్యక్షులు జక్కంపూడి రాజా, వైసీపీ విద్యార్ధి విభాగం కార్యదర్శి సలామ్‌బాబు హాజరౌతున్నారని జిల్లాలోగల నిరుద్యోగ యువత విద్యార్ధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఛలో కలెక్టరేట్ పోస్టర్‌ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ, శిమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వెటర్నరీ షాపులు టీడీపీ కార్యకర్తలకేనా...!
* వైసీపీ నేత శిమ్మ రాజశేఖర్
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 17: అంబేద్కర్ జంక్షన్ వద్ద వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణంలో రూ.1.40కోట్లతో నిర్మించిన షాషింగ్ కాంప్లెక్స్‌లో షాపులు చేనేత కార్మిక సంఘాలకు అందజేయాల్సి ఉండగా వాటిని టీడీపీ కార్యకర్తలకు అందించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుందని వైసీపీ నేత శిమ్మ రాజశేఖర్ అన్నారు. చేనేత కార్మికులకు ఈ షాపులు పూర్తయితే వారి బ్రతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశపడుతున్నారని... అయితే అవి కూడా వేరేవారికి కట్టబెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలకే వాటిని కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఇది తెలిసీ చేనేత కార్మికుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయన్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా భవన సముదాయం ముందు చిరువ్యాపారులు చెప్పులు కుట్టుకుని బ్రతుకుతున్నాయని వారికి కూడా ఆ షాపులు దొరకుతాయని ఆనంద పడుతున్నారని కానీ వారికి షాపులు కేటాయించకుండానే అక్కడ నుండి ఖాళీ చేయించే పథకం వేస్తున్నారన్నారు. కోణార్కు శ్రీను మాట్లాడుతూ నగరంలో 29వేల వైసీపీ కార్యకర్తల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఓటు వేసే హక్కు అందరికీ ఉందని అలాంటప్పుడు ఓట్లను కూడా రాజకీయం చేయడం బాదాకరంగా ఉందన్నారు. వైసీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ని ధనంజయ, మెంటాడ స్వరూప్, మండవిల్లి రవి, గుడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మహానిరసన దీక్షను విజయవంతం చేయండి
వీరఘట్టం, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రంలోని ఈ నెల 19న ఏర్పాటు చేయనున్న మహానిరసన దీక్షను విజయవంతం చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ జిల్లా కార్యదర్శి మరిచెర్ల జగన్మోహన్‌రావు అన్నారు. ఆయన శనివారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సిపి ఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపిపై మొండి వైఖరి విడనాడాలని, విశాఖకు రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన మహా ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.

లెవీ సేకరణ లక్ష్యాలపై రైస్‌మిల్లుల ఆకస్మిక తనిఖీలు
కొత్తూరు, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ సంస్థకు బియ్యం సేకరించే లక్ష్యాలపై రైస్‌మిల్లులను సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండురోజులుగా బమ్మిడి, కురిగాం రైస్‌మిల్లులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వానికి అందించే బియ్యాన్ని లక్ష్యాలను అధిగమించేందుకు జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలో 40 రైస్‌మిల్లులు లెవీ సేకరణలో వెనుకబడి ఉండడంతో ఐదు బృందాలను జిల్లా జాయింట్ కలెక్టర్ నియమించి ఈ తనిఖీలకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. బమ్మిడి గ్రామానికి చెందిన శ్రీనివాస ట్రేడర్స్, అమ్మన్నమ్మ రైస్‌మిల్లులను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేయగా శనివారం కూడా కురిగాం గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్లును అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఎస్‌ఒ శేషు, సి ఎస్‌డిటిల ఆధ్వర్యంలో బృందం దాడులు నిర్వహించారు.

నిధులు కేంద్రానివి.. పేర్లు చంద్రబాబువి
పథకాల్లో అవినీతిని ప్రశ్నిస్తే తిరగబడుతున్నారు
బిజెపిపై బురదజల్లితే ఊరుకునేది లేదు
ఎమ్మెల్సీ సోము వీర్రాజు
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 17: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పేరు పెట్టుకుంటున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ ఎదురుగా నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై దుయ్యబట్టారు. విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఇప్పటివరకు ఆ నిధులను ఏం చేశారో లెక్క చెప్పడం లేదన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణా కేవలం రూ.155 కోట్లతో సచివాలయాన్ని నిర్మిస్తుంటే, ఇక్కడ కష్టాల్లో ఉన్నామని చెబుతూ ముఖ్యమంత్రి నిరంతరం స్కెచ్‌లు వేసుకుంటూ వేల కోట్ల రూపాయలు లెక్క చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. పోలవరానికి రూ.16 వేల కోట్లు నాబార్డు ద్వారా అందించామని, ఇప్పటివరకు దానిపై కూడా సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి లెప్ట్ కెనాల్‌ను అభివృద్ధి చేయకుండా కేవలం రిజర్వాయర్ చుట్టూ హెడ్ వర్క్‌ను పూర్తి చేసి ప్రజలను మభ్యపెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పోలవరం వైపు వెళ్లకుండా ఇప్పుడు ఆ ప్రాజెక్టును తన ఆత్మ అని చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి ప్రభుత్వంతోనే ఆ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మడం ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తే జిల్లాలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. పారిశ్రామికవాడ నిర్మాణం కోసం కేంద్రం 30 శాతం సబ్సిడీ ఇస్తుందని అయినప్పటికీ దీనిపై రాష్ట్రం దృష్టిపెట్టడం లేదని సోము వీర్రాజు అన్నారు. విభజన చట్టంలో 12 అంశాలను 2022లోగా పూర్తి చేయాలని ఉన్నప్పటికీ ఇప్పటికే 9 ప్రారంభించామని చెప్పారు. వనం మనం, నీరు- చెట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే 50 కోట్ల మొక్కలు వేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో కనిపిస్తుందన్నారు. మొక్కలు కన్నా బోర్డులే అధికంగా ఉన్నాయన్నారు. చంద్రన్న బీమా, పింఛన్లు, గృహ నిర్మాణాలు, మరుగుదొడ్లు కార్యక్రమాలతో పాటు రహదారులు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. అనంతరం బూత్ లెవెల్ కమిటీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర గిరిజన మోక్ష నాయకురాలు తాడంగి సునీత, బిజెపి నాయకులు పైడి వేణుగోపాలరావు, తిరుపతిరావు, కణితి విశ్వనాధం, భాగ్యలక్ష్మీ, కోట నారాయణరావు, టంకాల దుర్గారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాడు రైల్వేజోన్ ఎర్రంనాయుడే అడ్డుకున్నారు
ఎమ్మెల్సీ మాధవ్
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 17: కేంద్ర మంత్రిగా 2004లో పనిచేసిన కాలంలో స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు పార్లమెంట్‌లో విశాఖ రైల్వేజోన్‌ను అడ్డుకున్నారని ఎమ్మెల్సీ పి.వి. ఎన్.మాధవ్ అన్నారు. శనివారం నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో కొత్తగా 20 రైల్వేజోన్లు ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించగా అందులో విశాఖపట్నం కూడా ఉందన్న విషయాన్ని తెలియజేశారు. అయితే ఎర్రంనాయుడు అడ్డుకోవడం ద్వారానే కేవలం జోన్ నిలిచిపోయిన విషయాన్ని వెల్లడించారు. విశాఖ జోన్ చేయడం ద్వారా శ్రీకాకుళం, పలాస ప్రాంతాలకు నష్టం జరుగుతుందని అనుకొని తాను జోన్‌ను అడ్డుకున్నట్టు తర్వాత బాధపడ్డారని ప్రస్తావించారు. ప్రస్తుతం ఎంపిగా ఉన్న ఆయన కుమారుడు దీనిపై అవగాహన లేకుండా కేవలం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. మిత్రపక్షంగా ఉంటూ ఈ విధమైన కార్యాచరణ చేయడం తగదన్నారు. విశాఖపట్నం రైల్వేజోన్ చేసేందుకు బిజెపి కృషి చేస్తుందన్నారు. తప్పుడు సమాచారం ద్వారా ప్రజలను తెలుగుదేశం పార్టీ మభ్యపెట్టాలని చూస్తే బిజెపి కార్యకర్తలంతా ఏకమై జరిగిన విషయాలను తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులు రాబడుతున్నామని చెప్పి ప్రస్తుతం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని, యుటర్న్ తీసుకున్న విషయంపై సమాధానం ఇవ్వాలన్నారు.

హోదాపై ఉద్యమానికి టిడిపి రావాలి
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 17: రాష్ట్రంలోని 25 మంది ఎంపిలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసే విషయంలో ఇప్పటికే వైకాపా ముందంజలో ఉందని, ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ కూడా కలిసి రావాలని వైకాపా నాయకులు వెలమల మన్మధరావు అన్నారు. శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తమ అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒకే మాటపై ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం జరిగిన పరిణామాల్లో కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు పోరాటానికి సిద్దం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దుంపల చిన్ని, ముద్దాడ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

చరిత్రకు సాక్ష్యం తర్లాకోట
పలాస, ఫిబ్రవరి 17: సిక్కోలు చరిత్రకు సాక్ష్యం తర్లాకోట అని చరిత్ర పరిశోధకులు, మధుచరిత్రకారుడు, పలాస ప్రభుత్వ జూనియర్‌కాలేజి చరిత్ర అధ్యాపకులు కొండల మధుబాబు అన్నారు.