ప్రకాశం

సాగర్ ఆయకట్టుదారులను ఆదుకునేదెవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 24 : సాగర్ కాలువకు నీరు విడుదల కాకపోవడంతో సుమారు 4లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్, రబీ పంటలు కోల్పోయారు. అయితే ప్రభుత్వం ఆయకట్టు రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేకపోవడంతో తమను ఆదుకునేవారు ఎవరని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో సుమారు 4లక్షల 32వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈఏడాది వర్షాభావంతో శ్రీశైలం, సాగర్‌కు నీరు రాకపోవడంతో నీటి విడుదల జరగలేదు. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలో రైతులు పంటలను కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల్లో కేంద్ర కరవు బృందాలను పంపి అంచనాలు తయారు చేయించినప్పటికీ సాగర్ ఆయకట్టు పరిధిలో ఈ బృందాలు పర్యటించి పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేవు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి పంట నష్టాన్ని అంచనా వేసిన దాఖలాలు లేవు. దీంతో సాగర్ ఆయకట్టు రైతులు తమ కష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించదా అని ఆందోళన చెందుతున్నారు. 4లక్షల 32వేల ఎకరాల్లో సుమారు 30శాతం ఆరుతడి పంటలైన పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తారు. మిగిలిన 70శాతంలో వరిపంట సాగు చేస్తారు. ఎకరాకు 20 బస్తాల ప్రకారం వేసుకున్నా సుమారు 500కోట్ల రూపాయల మేర సాగర్ ఆయకట్టు రైతులు కోల్పోయారు. అలాగే పత్తి, మిర్చి పంటల ద్వారా సుమారు 150కోట్ల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయకట్టు రైతులను కనీసం పలుకరించే నాథుడు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదిలాఉంటే సాగర్ ఆయకట్టు పరిధిలో వరిసాగు కాకపోతే రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత కూడా తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. ఈప్రాంతంలో వరిసాగు జరిగితే పశుగ్రాసం రాయలసీమలోని కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులు కొనుగోలు చేసుకొని తీసుకువెళ్తారు. ఇక్కడే పంట లేకపోవడంతో ఆ జిల్లాల్లో కూడా పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో సాగర్ ఆయకట్టు రైతులకు కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలని రైతులు కోరుతున్నారు.
సమస్యల ప్లాట్‌ఫామ్‌పై
ఒంగోలు రైల్వేస్టేషన్
‘‘జిల్లాలోని రైల్వేప్రయాణికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యార్థం పెద్దపీట వేస్తున్నామని ప్రకటన చేస్తుందే తప్ప ఆచరణలో మాత్రం జరగకపోవటంతో ప్రయాణికులు పెదవివిరుస్తున్నారు. రైల్వేకు వేలకోట్లరూపాయల ఆదాయంవస్తున్నప్పటికీ ప్రయాణికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు చక్కటి ఉదాహరణే ఒంగోలు రైల్వేస్టేషన్.’’
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 24: జిల్లా కేంద్రమైన ఒంగోలు రైల్వేస్టేషన్ జిల్లాకే తలమానికంగా ఉండాల్సిఉంది పోయి సమస్యలతో సతమతమవుతుందని చెప్పవచ్చు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో మూడుప్లాట్‌ఫారాలు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు కాని, లిఫ్ట్ సౌకర్యం లేవు. దీంతో ప్రయాణికులు మొదటిప్లాట్‌ఫాం నుండి మూడవ ప్లాట్‌ఫాంకువెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కసారి రైలు వచ్చేసమయంలోను రైల్వేలైను దాటుతూ ప్రయాణికులు ఇబ్బందులకు గురైన సంఘటనలు లేకపోలేదు. ముఖ్యంగా వృద్ధుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకటవ ప్లాట్‌ఫాంనుండి మూడవ ప్లాట్‌ఫాంకు వెళ్ళేందుకు బ్రిడ్జిపై నుండి వెళ్తున్నారు. కొంతమంది వృద్ధులు బ్రిడ్జి మెట్లు ఎక్కలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాస్థాయి రైల్వేస్టేషన్‌కు తగ్గట్లుగా అధునాతనమైన సదుపాయలు లేకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఈ రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లను ఏర్పాటుచేయాలని జిల్లాలోని రైల్వేప్రయాణికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా టిక్కెట్ కౌంటర్ల సంఖ్యను సైతం పెంచాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. సరిగా రైళ్ళు వచ్చే సమయానికి ప్రయాణికులతో టిక్కెట్లుకౌంటర్లు అన్ని కిక్కిరిసిపోతుండటంతో కొంతమంది ప్రయాణికులు ఆ రైళ్లను అందుకోలేక బస్సులను ఆశ్రయించిన పరిస్థితులు కూడా కొకోల్లులుగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మంచినీటి సదుపాయం కూడా సక్రమంగా లేకపోవటంతో ప్రయాణికులు మినరల్ వాటర్ బాటిళ్ళపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిఇలా ఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలు రైల్వేస్టేషన్‌ల ముఖ్యంగా కేరళ, జోధ్‌పూర్, జైపూర్, పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ల హాల్టింగ్‌లు లేకపోవటంతో ఆయాప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో రాజస్థాన్‌కు చెందిన వారు ఎక్కువ శాతంమంది నివాసం ఉంటున్నారు. కాని ఇంతవరకు జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌ను మాత్రం మన ప్రజాప్రతినిధులు సాధించలేకపోతుండటంతో ప్రయాణికులు విజయవాడ వెళ్ళే జోధ్‌పూర్ వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంమీద జిల్లాకేంద్రమైన ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు తగ్గట్లుగా సౌకర్యాలులేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి
- మంత్రి శిద్దా పిలుపు
దర్శి, జనవరి 24 : విద్యార్థి దశలో విద్యతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన 46వ బాల బాలికల నియోజకవర్గ జోనల్ పోటీలు ముగింపు సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ నేటి నవీన నాగరిక సమాజంలో ప్రజలు అనేక సామాజిక రుగ్మతలకు గురవుతున్నారని, వీటి నుండి బయట పడాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని, అందులో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడల్లో రాణించిన వ్యక్తులు అన్నీ రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. నియోజక వర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి అన్నీ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే స్టేడియం శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన రక్షిత మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు తన సొంత నిధులతో రక్షిత మంచినీటి శుద్ది యంత్రాన్ని నెలకొల్పుతామని తెలిపారు. నియోజక వర్గంలో వందల కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నారని, ఇటీవల విశాఖ పట్నంలో పెట్టుబడిదారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, ఐదు లక్షల 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు. దొనకొండను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ది పరిచేందుకు అన్నీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల చైనా బృందం కూడా దొనకొండలో పర్యటించడం జరిగిందని, త్వరలోనే దొనకొండ ప్రాంతానికి మంచి పరిశ్రమలు రానున్నాయని, దీంతో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య వైదొలగి పోతుందని నైపుణ్యం కల వ్యక్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నియోజక వర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేయడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు , డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రామలింగం, మండల విద్యాశాఖాధికారి రఘురామయ్య, డిఎస్‌పి వి శ్రీరాంబాబు, ఎంపిపి పూసల సంజీవయ్య, సర్పంచ్ జిసి గురవయ్య, ముండ్లమూరు, కురిచేడు ఎంపిపిలు వెంకట్రావు, కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు మారం శ్రీనివాసరెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శోభారాణి, మండల ఉపాధ్యక్షులు మారం శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు కలవకొలను చంధ్రశేఖర్, సూరే చిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక విద్య ప్రభుత్వ కనుసన్నల్లోనే జరగాలి
* ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు, జనవరి 24: ప్రాధమిక సెకండరీ విద్యా విధానం మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లోనే జరగాలని, వెనుకబడిన ప్రాంతాల్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు సమకూర్చాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పిఆర్‌టియు ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రతిభ పురస్కార్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో పాసు చేయించిందని, ఈవిధానం వలన ప్రభుత్వ, ప్రైవేటు మధ్య విద్యలో పోటీతత్వం పెరుగుతుందని, ఫలితంగా ప్రైవేటువైపే ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, తల్లితండ్రుల తరువాత గురువుకే ప్రాధాన్యత ఉందని, ప్రస్తుత సమాజంలో విద్యావిధానంలో పోటీతత్వం పెరిగి వృత్తిపై భారం పెరిగిందన్నారు. జిల్లాపరిషత్, ప్రైవేటు స్కూల్స్ మధ్య పోటీతత్వం నెలకొందని అన్నారు. ప్రతి పోటీ పరీక్షల్లో కూడా గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఎంపిక అవుతున్నారని, అందుకు కారణం ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు పనిచేయడంతోనే ఈవిధానం జరుగుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పట్ల పోటీ పెరగడం వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతాయని, ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించి ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యావిధానం ఎదగాలని కోరారు. ఈసమావేశంలో పాల్గొన్న ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ సాధిస్తామని, ఫలితంగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులను సమాజానికి దగ్గరికి తీసుకువచ్చే విధంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. ఏ విద్యార్థిలో ఏ నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యత వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈకార్యక్రమంలో సబ్జెక్టు బోధించి నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులను పురస్కార్ అవార్డులను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులు అందించి ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎంఇఓ ఎం సుబ్బారావు, డిప్యూటీ డిఇఓ అమరేశ్వరరావు, హెచ్‌ఎంలు ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జాతి నిర్మాణానికి పాఠశాలలు పునాదులు కావాలి
- జడ్పీ చైర్మన్ ఈదర
సంతనూతలపాడు, జనవరి 24 : ప్రపంచం గర్వించేలా జాతి నిర్మాణానికి పాఠశాలు పునాదులు కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. ఆదివారం మద్దులూరులోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో ఈనెల 20 నుండి 24వ తేది ఆదివారం జరిగిన ప్రకాశంజిల్లా సెకండరీ పాఠశాలల 64వ క్రీడలు, ఆటల పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, క్రీడలు, విద్యలో కూడా విద్యార్థులు రాణించడం వలన ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణం జరుగుతుందన్నారు. 130 కోట్ల భారతదేశ జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో గెలవలేక పోవడం విచారకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పాఠశాలను మోడల్ స్కూల్‌గా తయారు చేసి ప్రహరీగోడ నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటముల నుండి స్ఫూర్తి పొందాలని, ఆటల పోటీల నిర్వహణకు సహకరించిన స్థానికులు ఎంతో అర్భాటంగా నిర్వహించడం గొప్పవిషయమని, ఈ క్రీడలకు గ్రామస్థుల సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ క్రీడల నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు పలువురు దాతలు ఇతోధికంగా సహయపడ్డారని తెలిపారు. క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నాగేశ్వరావు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు, విద్య ఆవశ్యకతను గురించి వివరించారు. క్రీడలు, విద్యలో రాణించిన వారు భవిష్యత్తులో తిరుగు ఉండదని తెలిపారు. దాతలు ఒంగోలుకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు శ్రీనివాసులు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సంతనూతలపాడు జోన్‌లోని పలు ఆటల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. సంతనూతలపాడు జోన్‌లోని క్రీడల్లో పాల్గొన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏదో ఒక క్రీడలో గెలుపొందాయని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్ట్ఫికెట్లను అందజేశారు. ఈ క్రీడలకు చెందిన సర్ట్ఫికెట్లను ఎన్‌ఆర్‌ఐ కె శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దాసరి రవి, నువ్వుల మీరయ్య, శ్రీనివాసరావు, పాఠశాల పిడి ఎం బ్రహ్మయ్య, పిడిలు శ్రీనివాసరావు, వేణుగోపాల్, రామాంజనేయులు, ఎన్ క్రిష్ణ, హెచ్‌యం కెసిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.