మంచి మాట

సంగీత శాస్త్ర సర్వజ్ఞులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూకల చిన్న సత్యనారాయణ ‘త్యాగరాజ సారస్వత సర్వస్వం’ (900 పేజీలు), ‘వాగ్గేయకార కృతి సాగరం (రెండు భాగాలు), వంటి ఉద్గ్రంథాలలో వివిధ వాగ్గేయకారుల 1500 వందల వరకూ కృతులను ‘సాహిత్య స్వర’ బద్ధంగా, మూర్ఛన, స్వర, రాగ, తాళ విభజనాది సూచికలతో సర్వ సమగ్రంగా నూకల సంగీత ప్రపంచానికి అందించారు. ఇవేకాక 15పైగా గ్రంథాలలో సంగీత శాస్త్రంగురించి, తనదైన శైలిలో వివరిస్తూ, ప్రపంచ సంగీత శైలులలో పరిమిత గమకాలనే ఉపయోగిస్తారనీ, ఆ గమకాలన్నీ భారతీయ సంగీత పంచదశ, దశవిధ గమకాలలో పేర్కొన్నవేననీ, పాశ్చాత్య సంగీతంలో ‘ప్యూర్ నోట్’ (శుద్ధ స్వరం), ‘కంపితం’, ఎక్కుజారు, దిగుజారు, వంటి పరిమిత గమకాలు కర్ణాటక సంగీతంలో ఒక భాగమే ననీ, భారతీయ సంగీతం లోని ప్రకృతి, వికృతి స్వర సూత్రం ఆధారంగా రిషభ, గాంధార, మధ్యమ, ధైవత, నిషాధాలు శుద్ధ, చతుశ్రుతి, షట్ఛ్రుతి (సాధారణ, అంతర, కైశికి, కాకలీ) వంటి విధాలుగా పలికే ఏర్పాటు గురించీ, సైకిల్ ఆఫ్ ఫోర్త్స్, సైకిల్ ఆఫ్ ఫిఫ్త్స్ (షడ్జ, పంచమ, మధ్యమ) ఆధారస్వరాలతో స్థాయిలో ఆయా శ్రుతి, స్వర నిష్పత్తులు నిర్థారించడం గురించీ వివరిస్తూ, ఇదే భారతీయ సంగీతం, విశేషించి కర్నాటక సంగీత ప్రత్యేకత అని అభిప్రాయపడ్డారు.