అంతర్జాతీయం

ఇరాన్‌లో కూలిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహరాన్, ఫిబ్రవరి 18: ఇరాన్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 66మంది దుర్మరణం చెందారు. దేశంలోని జాగ్రోస్ పర్వతాల్లో అసేమన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇపి 3704 కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. టెహరాన్ నుంచి బయలు దేరిన ఈ విమానం 45నిముషాల్లోనే రాడార్‌కు కనిపించకుండా పోయిందని అధికారులు తెలిపారు. ఇది పర్వతమయ ప్రాంతం కావడం వల్ల కచ్చితంగా విమానం ఎక్కడ కూలిపోయి ఉంటుందన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ బృందాలు కూడా వెంటనే సహాయ చర్యలు చేపట్టలేక పోయాయని చెబుతున్నారు.ప్రమాద సమయానికి విమానంలో ఓ శిశువు సహా 60మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.