సబ్ ఫీచర్

ఎంతకూ గడవదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ లోకంలో అప్పుడే రెండు రోజులు గడిపిన
నా బంగారుతల్లి గుక్క తిప్పక ఏడుస్తుంటే
తనని ఊరుకోపెట్టేందుకు నే చేస్తున్నవన్నీ
విఫలయత్నాలవుతుంటే... భూమి మీద
పడగానే తనని చూసి రాలిన ఆనందబాష్పాలు
ఈవేళ ఏమీ చేతకాక దుఃఖంతో కన్నీళ్ళవుతుంటే
ఎంతకూ రేయ గడవదే

తను నాలో ఉన్నప్పుడు అభ్యసించిన జోలపాటలన్నీ
ఇప్పుడు గుర్తుకు తెచ్చుకు పాడుతున్నా, తాను
నిదురపోకుంటే... ఏరి కోరి మేధోమథనం చేసి
తనను అన్ని విధాలా చల్లగా కాచుకొంటుందని
కొన్న ఊయల ఖాళీగా ఊగుతుంటే, తను
సుఖంగా బయటపడ్డానికి ప్రతీరోజూ
క్రమం తప్పక చేసిన ఉదయ వ్యాహ్యాళి గుర్తొచ్చేలా
ఇప్పుడు తనని భుజాలపైన వేసుకుని తిరుగుతుంటే
తలంపుకొచ్చిన ప్రతీ దైవాన్నీ తలుస్తున్నా కాని...
తన కనురెప్పలు వాల్చకుంటే
ఎంతకూ రేయ గడవదే

ఎప్పుడూ తళుక్కున మెరిసే ఆ ఆ చిలిపి చూపులు
నీరసించి వెలవెలబోతుంటే... చెంగుచెంగున
తిరిగే నా చిట్టితల్లి అడుగులతో కళకళలాడే మా ఇల్లు
తన అలికిడి వినబడక బోసిగ బాధపడుతుంటే
కంగారుగ మా కనులు వైద్యుడి రాకకు వేచిచూస్తుంటే
అంతవరకు ఉపశమనానికి ఉపాయముందా? అని
ఆశతో అంతర్జాలాన్ని జల్లెడ పడుతుంటే
ఎంతకూ రేయ గడవదే

భయపడుతూ నా కొంగు పట్టుకు, నా వెనక
నక్కినక్కి తిరుగుతూ కొంటె చూపులు చూసే
చిట్టి పాప అప్పుడే నా చేయ విదుల్చుకొని తన
స్నేహితులతో కలిసి స్కూలుకెళుతోందని
అబ్బురపడుతుంటే... అయ్యో! నా బంగారం!
ఎన్ని ఇబ్బందులు పడుతోందో అక్కడ! అని
మనసు పరిపరివిధాల పరుగెడుతుంటే..
విశ్రాంతినిస్తుందా అన్నట్టు మాటలు, పాటలు పలికే
ఆ బుజ్జి నోరు, ఇప్పుడిలా వౌనంగా మొబైల్ ఫోన్లో
తన ఆనందాన్ని వెతుకుకంటోందే అని ఆలోచిస్తుంటే
ఎంతకూ రేయ గడవదే

నా మెడను చుట్టి నా తలకట్టును తికమకపెట్టే
ఈ కొంటెపిల్ల ఇప్పుడు ‘అలా కాదమ్మా ఇలా’
అని తన కురులను తానే సవరించుకుంటుంటే
ఒకప్పుడు కంటి మీద కునుకే ఎరుగని ఈ పిల్ల
పొద్దు పొడుస్తున్నా ఇప్పుడు ఆదమరిచి
నిద్రించడం చూసి నివ్వెరపోతుంటే
వడివడిగ నడుస్తున్నయ వత్సరాలు

నాన్నతో షికారుకెళుతూ ‘టాటా’ చెప్పడానికి
తటపటాయంచిన ఆ చిన్ని చేయ
భయం అన్నది తెలియనట్టు సర్రున స్టీరింగ్ తిప్పటం చూసి
దేవుడా!
నా చిట్టితల్లిని జాగ్రత్త! అని తలుస్తుంటే
వడివడిగ నడుస్తున్నయ వత్సరాలు

మన చిలిపి అల్లరజ్లూ చిన్నారులు
ఉరకలేసే యువతీ యువకులవుతుంటే
తడబడుతూ వారు వేసిన బుడిబుడి అడుగులు
ఈనాడు ప్రగతి ప్రధాన దృఢమైన ముద్రవేస్తుంటే
వారి అభివృద్ధి మన కళ్ళెదురుగ సాకారమవుతుంటే

వడివడిగ నడవవా వత్సరాలు
లోగిళ్లలో నిండవా ఆనందోత్సాహాలు

మూలం: జింజర్ హ్యూగ్స్ కవిత ‘డేస్ ఆర్ లోంగ్’
స్వేచ్ఛానువాదం: కౌముది ఎం.ఎన్.కె.