జాతీయ వార్తలు

కొఠారీ కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: నిన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. నేడు రోటోమాక్ ఓనర్ విక్రం కొఠారీ. పీఎన్బీ కుంభకోణ ప్రకంపనలు దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో మరో బడా వ్యాపారి గుట్టు రట్టయింది. దాదాపు 800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొఠారీ కుచ్చుటోపీ పెట్టినట్టుగా మీడియా కధనాలు వెలుగు చూస్తున్నాయి. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ నుంచి ఇంత భారీ మొత్తాన్ని కొఠారి రుణంగా తీసుకున్నాడని తెలుస్తోంది. కొఠారీకి రుణాలివ్వడానికి ఈ బ్యాంకులు నియమ నిబంధనలను తుంగలో తొక్కినట్టుగా తాజా కథనాలను బట్టి స్పష్టమవుతోంది. యూసీఓ నుంచి కొఠారీ 485 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ నుంచి 352 కోట్లు రుణంగా తీసుకున్నాడని, ఇంత వరకూ అసలు, వడ్డీ కట్టనే లేదని తెలుస్తోంది. గత వారం రోజులుగా కోల్‌కతాలోని కొఠారీ కార్యాలయం తలుపులే తెరుచుకోలేదు. ఆయన ఆచూకీ కూడా తెలియడం లేదు. రుణ మొత్తాన్ని రాబట్టుకునేందుకు బ్యాంకు అధికారులు ఆయన కోసం గాలిస్తున్నారు.