ఆంధ్రప్రదేశ్‌

రాజీనామాలు చేసేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను సిద్ధమేనన్న మాణిక్యాలరావు విష్ణువర్ధన్‌రెడ్డితో అధ్యయన కమిటీ
బాబు హామీలపై మనమూ నిలదీద్దాం అవినీతి అంశాలపై ప్రశ్నించాల్సిందే
అసెంబ్లీలో ఇక ప్రతిపక్ష పాత్ర దూకుడు పెంచిన రాష్ట్ర బీజేపీ

అమరావతి, ఫిబ్రవరి 18: అనుకున్నదే జరుగుతోంది. టీడీపీ- బీజేపీ మధ్య అగాధం పెరిగి పెద్దదవుతోంది. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, తమ ఇద్దరు మంత్రులు టీడీపీ మంత్రివర్గం నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకునే దిశగా బీజేపీ ముందుకు సాగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీపై ఎదురుదాడి విషయంలో వౌనంగా ఉన్నా, పార్టీ నేతలు మాత్రం టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. రాష్ట్రం లో, అసెంబ్లీలో ఇక అసలుసిసలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు. దాంతో అధ్యక్షుడి అభిప్రాయాలు, నిర్ణయాలతో సంబంధం లేకుండానే ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నట్లు ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో స్పష్టమైంది. పార్టీ సమావేశంలో మాట్లాడని కొద్దిమంది నేతలు వినా మిగిలిన వారంతా టీడీపీ తమపై చేస్తున్న దుష్ప్రచారంపై ఎదురుదాడి చేయాల్సిందేనని తీర్మానించారు. ముఖ్యంగా బాబు మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసి బయటకొచ్చి పార్టీని బతికించుకుందామన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సూచనలతో మెజారిటీ నేతలు ఏకీభవించారు. మనల్ని దోషులుగా నిలబెడుతున్న టీడీపీపై మొహమాటం ప్రదర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని, మనంకూడా వారిస్థాయిలో ఎందుకు ఎదురుదాడి చేయడం లేదని నిలదీశారు. దీనిపై స్పందించిన మంత్రి మాణిక్యాలరావు ‘నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే రాజీనామా చేయడం నిమిషాల పని. అసలు మీ పార్టీని టీడీపీ వాళ్లు రోజూ తిడుతుంటే మీరెందుకు రాజీనామాలు చేసి బయటకు రావడం లేదని నాకు మనవాళ్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు. అందుకే నేను ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాల్సి వస్తోంది. నాకూ ఈ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు. కేంద్రం ఇచ్చిన నిధులు, వాటిని రాష్ట్రం వినియోగిస్తున్న తీరు, ఉపాధి హామీ పథకం, పోలవరం, తదితర అంశాల్లో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ సంసిద్ధత వ్యక్తం చేశారు. గతంలో పోలవరం, ప్యాకేజీపై బాబు ఏవిధంగా అసెంబ్లీని వేదికగా చేసుకున్నారో, తామూ కేంద్రం ఇచ్చిన నిధులను శాఖల వారీగా వివరించడం ద్వారా అదే అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు.
పార్టీని టీడీపీ ఒక పథకం ప్రకారం గత నాలుగేళ్ల నుంచి బలహీనపరిచిందని, ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు అన్నీ తీసుకుని ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నా వౌనంగా ఉంటే పార్టీకి ఉనికే ఉండదని గ్రహించింది. అందుకే తాము కూడా 2014లో టీడీపీ ఇచ్చిన హామీల అమలు, 13 జిల్లాలకు కేటాయించిన నిధులు, వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఆగిన ప్రాజెక్టులపై పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికకు ఐదు రోజుల గడువు విధించింది.
chitra....
విజయవాడలో ఆదివారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు