Others

సుమధురమీ రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమధుర రామాయణం
రచన: టంగుటూరి మహాలక్ష్మి
వెల: రూ. 180/-లు
ప్రతులుదొరుకు చోటు
ఎ. రామకృష్ణారావు
30-637/2/1 చంద్రగిరి కాలనీ ఈస్ట్
నవభారత పబ్లిక్‌స్కూల్ వెనుక
నేరేడ్ మెట్ , హైదరాబాద్500056
సెల్: 9951417344, 040-27224624

ధవళ వస్త్రంబు దరహాస దంతిముఖము
ఏకదంతంబుతో వెలుగొందునట్టి
సకల విద్యల కెల్లదానొజ్జయైన
కొండమనుమని కెపుడు దండంబు లిడుదు
అని కొంగొత్తగా రాముని జీవిత చరిత్రనంతా పూసలుగా తీర్చిదిద్ది పద్యాల హారానే్న తయారుచేశారు శ్రీమతి టంగుటూరి మహాలక్ష్మిగారు. దేశం కోసం స్వాతంత్ర సమరయోధులుగా ఖ్యాతి గడించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి వంశజులు శ్రీమతి టంగుటూరి మహాలక్ష్మిగారు వంశపు వాసన పోకుండా సంపాదించుకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలను మరింత మెరుగుపర్చుకోవడానికి రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొంటే భారతీయులంతా ధర్మాచరణులు అవుతారనే ఆశతోనేమో అందరూ నిదేల రామాయణమని అన్నా విశ్వనాథగారు ముందే వారికి జవాబు చెప్పారుకనుక మళ్లీ తన దైన శైలిలో ఆనాడు వాల్మీకి గారు గానం చేయించిన రామాయణ గానాన్ని నేడు పద్యాలతో కూర్చారు.
వీటిలో దీర్ఘసమాసాలు కాని, పదాడంబరాలు కాని లేవు. చదివీ చదవగానే అర్థమయి ఆనందింపచేసే అలతి అలతి తెలుగు పదాలే ఉన్నాయి. తీయని ద్రాక్షాపాకంలాగా చెవలూరించే ఈపద్యాల హారం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏక బిగిన చదివిస్తుంది. సాహితీ ప్రపంచవేదికకు ఆహ్వానమందుకునే ఈ ‘సుమధుర రామాయణం’ రామభక్తులే కాక పద్యాల మీద మక్కువ ఉన్న వారికి,జిజ్ఞాసాపరులందిరికీ సుమధుర భావాలను హృదయంలో రేకెత్తించి, వారిని పోతపోసిన ధర్మంగా వెలుగుతున్న రామునికి భక్తులను చేస్తుంది. ఆ రాముని నడకలో అడుగులు వేయిస్తుంది. అందరినీ ధర్మపరాయణులను కావిస్తుంది అనడంలో అతిశయం లేదు. మొత్తం యుద్ధకాండ వరకు 1376 పద్యాలతో కూర్చిన ఈ రామాయణంలో కేశవనామాలను కూడా చివరన చతుర్వింశతి (24) అన్న పేరిట కేశవ నామాలను కూడా పద్యరూపంలో శ్రీమతి టంగుటూరి మహాలక్ష్మిగారు అందించారు. ఇవి చదవడానికే కాక అర్థం చేసుకోవడానికి సులువుగా ఉన్నాయ. కొత్తగా పద్యాలు చదివేవారికి కూడా ద్రాక్షాపాకంగానే ఈ పద్య రచన సాగడం రచయత్రికి ఉన్న భాషపై మక్కువఎంతో తెలియచేస్తుంది

- చరణశ్రీ