సబ్ ఫీచర్

కేశవనామాలు పుణ్యప్రదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశవ
1.కేశవుని నామమే మనఃక్లేశహరము
పరమ పావన మాశ్రీత భక్త జనుల
కల్పవృక్షము పన్నగ తల్పు జూపు
అంజనము జపింయించుడీ కంజధరుని

నారాయణ
2.జీవనాధార మిలలోని జీవతతికి
నరయ నారాయణుండని నమ్మి హృదిని
నిముసమైనను మరువక నీరజాక్షు
దలచుచుండిన దాపుని నిలచి గాచు

మాధవ
3.మాధవుడె మాకు ధవుడని మందలోని
గోప వనితలు శ్రీపతిన్ తాపమునను
మధుర బృంగార భావనా మగ్నులౌచు
భక్తి సేవించి ధన్యులై ముక్తిగొనిరి

గోవింద
4.ఆదిదైవమ గోవింద వేదసార
పన్నగాశన వాహన పద్మనయన
భక్త జనకల్ప భూజమా భోగిశయన
నిన్ను గొల్చెద గావవే నీలవర్ణ

విష్ణు
5.విష్ణు నంశంబులే వాసవాది సురలు
వేద వేద్యుని నామముల్ వేయి దివ్య
మంత్ర రాజము లానామ మంత్ర పఠన
గలుగజేయును జనులకు కలిమి బలిమి