చిత్తూరు

ఏపీలో 2019 నాటికి పూర్తిస్థాయిలో బ్లాక్ చైన్ టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 19: దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా భూమి విక్రయ రిజిస్ట్రేషన్, డిజిటల్ డాక్యుమెంట్లను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ 2019 లోపల అన్ని వ్యవస్థలకు అనుసంధానం చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.ఎ.చౌదరి అన్నారు. ఎస్వీయూనివర్శిటీ సెనెట్‌హాల్లో సోమవారం తిరుపతి ఐఈటీఈ సెంటర్ ఆధ్వర్యంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ బ్లాక్‌చైన్ టెక్నాలజీ నేడు ప్రపంచంలోనే కొత్త ఒరవడి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్సులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రపంచంలోనే సంపూర్ణంగా ఏపీలో అందుబాటులోకి తీసుకు రానున్నదని అన్నారు. విద్యార్థులు సొంతంగా పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ పొందాలన్నారు. ప్రస్థుతం ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, బిగ్ డేటాఅనలైటిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎస్వీయూ విసి ఆచార్య దామోదరం మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న నూతన సాంతికేక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అందులో మెలకువలు సాధించి పరిశోధనలకును అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐఇటిఇ అధ్యక్షులు ఆచార్య కెటివి రెడ్డి, బెంగుళూరు ఐ ఐటి డాక్టర్ శశాంక్, డైరెక్టర్ జనరల్ ఎన్‌టి అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుపతి, ఫిబ్రవరి 19: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు స్పీకర్ దనపాల్, చెన్నయ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రన్, తెలంగాణ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్‌తివారి, రాజ్యసభ సభ్యులు సి ఎం రమేష్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాలు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేదపడిందుతు ఆశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

20న వృద్ధులు, దివ్యాంగులకు,
21న చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం
తిరుపతి, ఫిబ్రవరి 19: వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రతినెలా రెండు సాధారణ దినాల్లో ప్రత్యేక దర్శనం కల్పించే సౌకర్యాన్ని టీటీడీ అమలు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 20న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించనున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు 4000 టోకెన్లను జారీ చేయనున్నారు. ఉదయం 11 గంటల స్లాట్‌కు 1000 మంది, మధ్యాహ్నం రెండు గంటల స్లాట్‌కు 2000 టోకెన్లు, మూడు గంటలకు 1000 మందికి టోకెన్లు జారీ చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయం లోపలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. భక్తుల కోరిక మేరకు అదనంగా నెలలో ఎక్కువ మందికి వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. రద్దీరోజుల్లో కూడా వృద్ధులు, దివ్యాంగులు ప్రతిరోజూ రెండు పర్యాయాలు కల్పిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఈనెల 21న బుధవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుపధం ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. ఇక సాధారణ రోజుల్లో ఒక ఏడాదిలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపధం ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలున్న తల్లిదండ్రులకు కూడా నెలలో రెండు రోజుల పాటు అదనపు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ కల్యాణ మండపాల ఆన్‌లైన్ బుకింగ్‌కు చర్యలు
తిరుపతి, ఫిబ్రవరి 19: చిత్తూరు జిల్లాలోని టీటీడీ కల్యాణ మండపాలను ఆన్‌లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించామని, అదే తరహాలో ప్రతి రెండు నెలలకు రెండు జిల్లాల చొప్పున న్ని ప్రాంతాలలోని కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేలా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఐటీ ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి భక్తిసాహిత్యాన్ని భక్తులకు మరింత అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాల్లో టీటీడీ పుస్తక ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. శ్రీవారి దర్శనార్థం సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానాన్ని మార్చి రెండో వారం నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో కౌంటర్లలో అందుకు అవసరమైన ఐరిష్ గుర్తింపు, వేలిముద్రణ గుర్తింపు తదితర పరికరాలు, ఇతర వౌలిక సదుపాయాలను సమీకరించుకోవాలని ఆదేశించారు. తిరుమలలో విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్ వైర్లు బయటకు కనపించకుండా వైరింగ్ విధానాన్ని అమర్చాలని ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు సూచించారు. తిరుమలలో సూచిక బోర్డుల ఏర్పాటుకు శ్రీవారి సేవకుల చేత సర్వే చేయించి ప్రముఖ భాషల్లో ముఖ్యప్రాంతాల వివరాలతో బోర్డులు పెట్టాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ క్యూలైన్ల నుంచి శ్రీవారి దర్శనానికి వదిలే సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు చేయాలన్నారు. తిరుమలలో బూందీ కాంప్లెక్స్ నిర్మాణ నమూనాలకోసం బీహెచ్‌ఈఎల్ నిపుణులతో అధ్యయనం చేయించి నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. టీటీడీ ఆస్తులు, వస్తువులు, పరికరాలను గుర్తించేందుకు వీలుగా టూల్స్ అండ్ ప్లాంట్స్ రిజిస్టర్‌లో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ జే ఈ ఓ శ్రీనివాసరాజు, సీవీ ఎస్వో రవికృష్ణ, ఎఫ్‌ఏసిఏఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.