గుంటూరు

టెన్నిస్ పోటీల విజేతలు గిరీష్, అశ్రీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), ఫిబ్రవరి 19: వ్యాంటిజ్ టెన్నిస్ క్లినిక్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక పలకలూరు రోడ్డులోని అకాడమిలో జరుగుతున్న ఐటా అండర్-16 బాలబాలికల టాలెంట్ సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్స్‌లో బాలుర విభాగంలో విజయవాడకు చెందిన కె గిరీష్, బాలికల్లో గుంటూరుకు చెందిన లేళ్ల అశ్రీత విన్నర్స్ టైటిల్‌ను సాధించారు. ఈ పోటీల్లో రన్నర్స్‌గా బాలురలో హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ శ్రీనివాస్, బాలికల్లో గాయత్రి నిలిచారు. అండర్-16 డబుల్స్ బాలుర విభాగంలో సయ్యద్ అమర్, నితిష్‌ల జంట విన్నర్స్‌గానూ, కెవి అపురూప్, ఆదాం జంట రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కెఆర్ సుమంత్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి కెఆర్ మధుకర్, ఎన్‌టిఆర్ స్టేడియం టెన్నిస్ సంఘ కార్యదర్శి నల్లబోతు శ్రీనివాసరావు, ఎం నరేంద్రకుమార్, టెన్నిస్ శిక్షకుడు జివిఎస్ ప్రసాద్, పి ఆనంద్, కెఆర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో యార్డుల అభివృద్ధికి ప్రణాళిక
* రాజధాని నిర్మాణానికి ఒక నెల చైర్మన్ల గౌరవవేతనం
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 19: మిర్చియార్డులో సోమవారం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ల సమావేశం జరిగింది. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ మిర్చిలో నాణ్యతా ప్రమాణాలు తెలిపే ల్యాబ్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి యార్డు చైర్మన్లు ఒక నెల గౌరవ వేతనాన్ని విరాళంగా అందించాలని సమావేశంలో నిర్ణయించారు. లింకురోడ్లు నిర్మాణం తక్షణమే చేపట్టాలన్నారు. రైతులు పండించిన పంటలను ఇళ్లకు తరలించే విషయంలో ఆర్థికభారం పడుతోందని, రైతుల సొమ్ము వారి అవసరాలకు ఖర్చు పెట్టడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. యార్డులలో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా మరింత అభివృద్ధిపర్చాలన్నారు. వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవన శాఖలను మార్కెటింగ్ శాఖతో అనుసంధానం చేయాలని తీర్మానించారు. రైతు బజార్ల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ మార్కెట్ యార్డుల నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అవసరమైతే న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో జిల్లాలోని యార్డు చైర్మన్లు మునగా నిమ్మయ్య, నన్నపనేని ప్రభాకరరావు, ఆంజనేయరాజు, పూజల వెంకట కోటయ్య, కేశమనేని శ్రీ్ధర్, వల్లభనేని సాయిప్రసాద్, సయ్యద్ పెద్ద కరిముల్లా, కమిటీ డైరెక్టర్లు పసుపులేటి శ్రీనివాసరావు, మన్నవ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌పి జాదా, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌దే
* మిత్రపక్షంలో ఉండి అంతర్గతంగా పోరాటం చేస్తున్నాం
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 19: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ఎలాంటి హోదా, హామీలపై స్పష్టమైన ప్రకటనలు లేకుండా రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్‌దేనని, ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా అంటూ ప్రసంగాలు చేయడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు పార్లమెంటులో కాంగ్రెస్ నాయకులు తలుపులు మూసివేసి రాష్ట్ర విభజన చేస్తుంటే ఈ నాయకులు ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా చేసిన విషయాన్ని గుర్తెరగాలని, ఆ పార్టీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై గానీ మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే అంతర్గతంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు పోరాటం చేస్తున్నామని స్పష్టంచేశారు. 29 సార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పరిస్థితులపై వివరించినప్పటికీ 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌కి 4 వేల కోట్లు మాత్రమే పంపించారని, పోలవరానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కన్నా హామీలు అమలు చేస్తామన్న కేంద్రప్రభుత్వం హామీల విషయంలో అనుకున్న మేరకు నిధులు కేటాయించడం లేదన్నారు. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే వైసీపీ పార్లమెంటు సభ్యులు బయటకు వచ్చారన్నారు. కేసుల మాఫీ, రాజకీయ లబ్ధితప్ప జగన్‌కు ప్రజా సమస్యలు ఏనాడూ పట్టలేదన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామంటూ ప్రసంగాలు చేస్తున్న జగన్ వెంటనే రాజీనామా చేయించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు షేక్ లాల్‌వజీర్, కంచర్ల శివారమయ్య, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.