కర్నూల్

బీజేపీని విమర్శించే రాజకీయ నైతిక హక్కు ఎవరికీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 19:నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ రూ. 2,500 కోట్లు విడుదల చేసిందని, బీజేపీని విమర్శించే రాజకీయ నైతిక హక్కు ఎవరికీ లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌పై ఏపీలోని మిత్రపక్షమైన టీడీపీతో పాటు రాజకీయ పార్టీలన్నీ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2014లో రాష్ట్ర విభజ సమయంలో టీడీపీ సమన్యాయమని, ప్రతిపక్ష పార్టీలు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేశాయే కానీ, అప్పడు స్పష్టంగా ఏపీకి ఏమి కావాలో చెప్పకుండా నాటకాలు ఆడాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఏపీకి 11 కేంద్ర విద్యాసంస్థలు మంజూరు చేసిందని, అందులో 9 విద్యాసంస్థల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎవరికీ మాట్లాడే హక్కు లేదన్నారు. బీజేపీ ఆవిర్భావానికి ముందు పోలవరం కోసం జనతా సంఘ్ పరివార్ ఉద్యమం చేసిందని, అలాంటి తమ పార్టీపై ఆరోపణలు తగదన్నారు. విభజన తర్వాత తమ పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలంగాణలోని 7 ముంపు మండలాలను కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ జారీ చేసి ఏపీలో విలీనం చేశారని, ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఆమోదించి వందకు వంద శాతం నిధులు రూ. 4,652 కోట్లు కేటాయించిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు రూ. 16వేల కోట్లు చూపుతూ కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపిందని, అందులో న్యాయంగా రూ. 4వేల కోట్లు మాత్రమేనని, మిగతా రూ. 7,552 కోట్లు రైతు రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లకు సంబంధించినది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఏపీ రాజధాని అమరావతిలో రూ. 2,500 కోట్లు ఖర్చు చేసి ఒక కోటి చదరపు అడుగుల్లో అసెంబ్లీ, సెక్రటరీయేట్, హైకోర్టు, గవర్నర్, ప్రభుత్వ భవనాలను నిర్మించవచ్చన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకూ లెక్కలు చెప్పకపోగా తమపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు.
గంజాయి పట్టివేత
ఆత్మకూరు, ఫిబ్రవరి 19:మండల పరిధిలోని కరివేన గ్రామ శివారులో సోమవారం పోలీసులు 14 కిలోల గంజాయి పట్టుకున్నట్లు డీఎస్పీ మాధవరెడ్డి అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు వల పన్ని గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన మురళీనాయక్, అతడి భార్య తులసీబాయి కలిసి కొల్లాపురానికి చెందిన చెంచు బయన్న నుంచి 14 కిలోల గంజాయి కొనుగోలు చేసి, దానిని ప్యాక్ చేసి కర్నూలుకు రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. దీని విలువ దాదాపు రూ. 2 లక్షలు ఉంటుందన్నారు. వారు గంజాయి ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు, ఇతర విషయాలపై విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
విష్ణుతో రాజీ ప్రసక్తే లేదు..
* ఒత్తిడి చేస్తే పదవికైనా రాజీనామా...
* ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ
కోడుమూరు, ఫిబ్రవరి 19:కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ ప్రసక్తే లేదని, రాజీకై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నుంచి ఒత్తిడి తెస్తే చివరకు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని కోడుమూరు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే తాను వైసీపీ నుంచి టీడీపీలోకి చేరగా ఈ విషయంపై కూడా తనను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే విలేఖరుల సమావేశంలో విష్ణుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పటిష్టతకు సైతం విష్ణు ప్రతినిత్యం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దళితులు రాజకీయంగా ఎదగకూడదనే లక్ష్యంతోనే తనకు ప్రతి పనిలో అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో వర్గపోరు రాజకీయాలకు పాల్పడటమే గాక, మాట వినని అధికారులను బెదిరిస్తూ పార్టీ ప్రతిష్టను బ్రష్ఠు పట్టిస్తున్నారన్నారు. టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా తాను నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి సభ్యత్వాలు సేకరించి దాదాపు రూ. 13లక్షల సభ్యత్వ రుసుమును పార్టీ అధిష్ఠానానికి అందించానని గుర్తుచేశారు. తాను సేకరించిన సభ్యత్వాలను సొంత పార్టీలోని వారే కాల్చివేశారని ఇలాంటి వాటి గురించి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. అలాంటి వారితో తాను రాజీపడే ప్రసక్తేలేదని మరోసారి తేల్చి చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు పన్నినా లెక్కచేయనన్నారు. మరో 6నెలల్లో రాజకీయ పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ‘ఎవరు ఎక్కడెక్కడ అడుగులు వేస్తారో చూడండి’ అని తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు అసెంబ్లీ గడ్డపై టీడీపీ జెండాను ఎగురవేస్తానని వివరించారు.
విద్యార్థులు యోధులుగా ఎదగాలి
* ఐజీ మహమ్మద్ ఇక్బాల్
దేవనకొండ, ఫిబ్రవరి 19: యోధులు పుట్టిన గడ్డ తేర్నేకల్ గ్రామమని, ఇటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు యోధులుగా ఎదగాలని రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ పిలుపు నిచ్చారు. బ్రిటీష్‌వారిని ఎదురించి ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ముత్తూరు గౌడప్పను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయంగా ఎదగాలన్నారు. బాధ్యతతో పని చేస్తూ ముందుకు పోవాలన్నారు. విద్యార్థులు ఏ పని చేసిన గుర్తింపు పొందేలా చూడాలన్నారు. దేవుడు ఎక్కడ లేడని, బడిలో ఉన్నాడని తెలిపారు. ప్రతి విద్యార్థి మంచి చదువులు చదివి గొప్పవారిగా కావాలన్నారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చిన్న వయస్సులో ఆడ పిల్లలకు వివాహాలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ఆట్టలు అందజేశారు. పాఠశాల ఆట స్థలాన్ని ఐజీ పరిశీలించి విద్యార్థులు ఆటల్లో కూడా రానించాలన్నారు.
మూలరాములకు పంచామృతాభిషేకం
మంత్రాలయం, ఫిబ్రవరి 19: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో వెలసిన శ్రీరాఘవేంద్రుని దివ్యసన్నిధిలో శ్రీమూలరామా దేవతామూర్థులకు పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. సోమవారం మూడవ రోజు గురువైభోత్సవాలోల భాగంగా పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీరాఘవేంద్ర స్వామి 397వ పట్ట్భాషేకం సందర్భంగా, 423వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి వివిధ ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. సంస్తాన పూజల్లో భాగంగా శ్రీమూలరామ, జయరామ, దిగ్విజయరామ, సంతానగోపాలకృష్ణులకు ప్రత్యేక అభిషేకాలు చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలను స్వర్ణపల్లకి, గజ, కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై అధిష్ఠించి, ప్రత్యేక హారతి ఇచ్చి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పండితకేసరి విద్వాన్ రాజాఎస్ గిరియాచార్యులు, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ గిరిధర్, సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, సిబ్బంది వ్యాసరాజాచార్, బిందు మాధవాచార్, కుర్డిజయతీర్థాచార్ తదితర మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా నరసింహస్వామి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* ఎగువలో అంకురార్పణ
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 19: నల్లమల అరణ్యంలో వెలసిన 108 దివ్య క్షేత్రాలలో ఒకటిగా పిలవబడుతున్న ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో జీపీఏ సంపత్, ఈఓ కామేశ్వరమ్మ, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలన్‌ల సమక్షంలో సోమవారం రాత్రి అంకురార్పణతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏదేని కార్యం తలబెట్టేముందు ఎటువంటి ఆటంకాలు జరగకుండా వినాయకున్ని పూజిస్తారు. అయితే వైష్ణవ క్షేత్రం అయిన అహోబిలంలో విష్వక్సేనున్ని కొలువుంచి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించిన అనంతరం విశ్వక్సేనుని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్సేనుని కొలువుంచిన మండపం వద్దకు పుట్టబంగారం తీసుకొచ్చారు. మండపానికి ఎదురుగా వున్న అరుగుపై విశ్వక్సేనుని కొలువుంచి హారతి, మహాహారతి అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రోఛ్చారణల మద్య మహా సంకల్పం, సుద్ద పుణ్యాఃవచనము, భూసూక్తపఠనం, మత్స్యంగ్రహనము కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మండపంలోని మట్టిని సేకరించి ఆలయ అర్చకులు వేద పండితులు పాళికలతో నవ ధాన్యాలను కలిపి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైకి చెందిన సీఎస్ వెంకటవరదన్ ఉభయధారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ నవధాన్యం విత్తనాలను 9 గ్రహాలు ఎవరెవరికి ఇబ్బంది కల్గిస్తుందో మనుషులకు, భగవంతునికి కూడా ఎలాంటి చెరుపు లేకుండా అంతా క్షేమంగా జరిగేటట్లు మొలక పెరిగి ఎలా చెట్టు అవుతుందో అదే విధంగా మొదలు పెట్టిన పనికి చేసే పూజలను అంకురార్పణం అంటారన్నారు. పుట్ట నుండి తీసుకున్న మట్టిని తీసుకొస్తామన్నారు. ఈ మట్టిలో మొలకలు అన్నీ పెరిగి పెద్దయ్యే విధంగా చేసే ఇంద్రాది అష్టదిక్పాలకులకు యంత్రహోమం, సోమకుంభస్థాపన, పాళికలతో పూజలు నిర్వహించామన్నారు. మట్టిని సేకరించడాన్ని మత్య్సంగ్రహణమంటారన్నారు. ఈ మట్టిని తీసుకొని వచ్చి నాలుగు వేదాలతో పుట్ట బంగారున్న మండపం వద్ద పూజలు నిర్వహిస్తారు. అంకుర హోమం అంటే నవధాన్యంలో ఒక్కొక్క ధాన్యానికి ఆది దేవతలను ఆవాహం చేసుకొని ఇంద్రో, వరుణో, అగ్ని, వాయు, కుబేర, ఈశాన్య అందరిని మృత్స్యము అంటే మట్టిలో పోసిన మొలకలకు షోడషపూజలు చేసి నవధాన్యాలను కళశాలలో పోసి ఆవాహము చేస్తామన్నారు. అంకురార్పణంలో భాగంగా సేకరించిన పుట్టబంగారాన్ని నవధాన్యాలతో కలిపి సోమకుంభస్థాపన, మృత్స్యంగ్రహణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రెవెన్యూ శాఖలో