కృష్ణ

సంక్షేమ పథకాల అమలులో నూతన ఒరవడి సృష్టించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 19: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నూతన ఒరవడి సృష్టించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మీకోసం’లో వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీ ఎండార్స్‌మెంట్ కాకుండా వాటిని పరిష్కరించే విధంగా పని చేయాలన్నారు. దీనిపై ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి మంగళవారం రెండు మూడు గంటల పాటు మీకోసంలో వచ్చిన అర్జీలను సమీక్షించుకుని అందుకు అనుగుణంగా పరిష్కార చర్యలు గైకోవాలన్నారు. నిబంధనలకు అనుకూలంగా ఉండే అర్జీలను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్న అర్జీలను పక్కన పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్, డీఆర్‌ఓ అంబేద్కర్, ముడా వీసీ విల్సన్‌బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
19విఎటి 1జెపిజి: ఏసీబీ అధికారులకు చిక్కిన కార్యదర్శి, హౌసింగ్ ఎఇలు
19విఎటి 2జెపిజి: వివరాలు వెల్లడిస్తున్న ఎసీబీ డీఎస్పీ ప్రసాద్
ఎసీబీ వలలో అవినీతి చేపలు
* లంచం తీసుకుంటూ పట్టుబడిన హౌసింగ్ ఎఇ, పంచాయతీ కార్యదర్శి
వత్సవాయి, ఫిబ్రవరి 19: లబ్ధిదారుల నుండి లంచం తీసుకుంటూ మండలంలోని ఇద్దరు అధికారులు ఎసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గృహనిర్మాణ శాఖ ఎఇ అప్పారావు, పోలంపల్లి పంచాయతీ కార్యదర్శి కోటయ్యలు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్‌గా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్‌పీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం 2003లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలంపల్లి గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వరరావుకు పక్కా గృహం మంజూరు అయ్యింది. అప్పుడు కొంత నగదు విడుదల అయ్యింది. ఇంకా లక్షా 15వేలు విడుదల చేయాల్సి ఉంది. ఈ బిల్లు కోసం లబ్ధిదారుడు ఎఇ అప్పారావును ఎన్ని మార్లు కోరినా స్పందించలేదు. డబ్బులు అధిక మొత్తంలో డిమాండ్ చేసి చివరకు పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక బాధిత లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఉదయం 11.55గంటలకు మాతంగి వెంకటేశ్వరరావు నుండి పదివేలు లంచం తీసుకొని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదేవిధంగా పోలంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కోటయ్య పక్కా గృహాల మంజూరు కోసం పాము శ్రీను, కట్ల విజయలక్ష్మి తదితరులను రూ.5వేల చొప్పున లంచం అడగ్గా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పంచాయతీ కార్యదర్శి కోటయ్య అనారోగ్యం కారణంగా సెలవు పెట్టానని, డబ్బులు తీసుకొని విజయవాడలోని నల్లకుంట ప్రాంతంలోని తన ఇంటికి రావాలని సూచించారు. వీరు ఆతని ఇంటికి వెళ్లి రూ.15వేలు ఇచ్చిన వెంటనే ఎసీబీ అధికారులు అతన్ని పట్టుకొని వత్సవాయికి తీసుకువచ్చారు. ఎస్‌సి లబ్దిదారుల నుండి లంచం తీసుకొని మండలానికి చెందిన ఇద్దరు అధికారులు ఏకకాలంలో ఎసిబీ అధికారులకు పట్టుబడటం సంచలనం కల్గించింది. ఏసీబీ డీఐజీ ఠాకూర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడిలో ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నట్లు డీఎస్‌పీ ప్రసాద్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.