విజయవాడ

కాలుష్య నివారణ చర్యలతో సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: జిల్లాలో గత 10రోజులుగా కాలుష్య నివారణ కు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం ము ఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నా రు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ కాలుష్యం కారణంగా వస్తున్న దు ష్ఫలితాల నివారణలో భాగంగా నగరంలో పెద్ద వాహనాలను అనుమతించకపోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. గత వారం బెంజి సర్కిల్ వ ద్ద వాయు కాలుష్యం ఆర్‌ఎస్‌పీఎం 10 2 ఎంజీ నమోదు కాగా, సోమవారం ఉదయానికి 89 ఎంజీగా నమోదైందని వివరించారు. అదేవిధంగా కంకర, ఇసుక సరఫరా చేసే లారీల్లో టార్పాలి న్ వేయించడం, వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. జిల్లాలో వ్యవసాయ రుణాలు నూటికి నూరు శాతానికి చేరుతున్నాయని, కౌ లు రైతులకు గత సంవత్సరం కంటే 8 రెట్లు అధికంగా రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి హామీ ప థకంలో జిల్లాలో మంచి ఫలితాలు వ స్తున్నాయన్నారు. మిర్చి, ఇతర వాణిజ్య పంటల కోతల ద్వారా కూలీలకు రూ. 400 నుండి 450 కూలీ వస్తున్నందున ప్రస్తుతం ఉపాధి కూలీల పనులు త క్కువుగా జరుగుతున్నాయన్నారు. మా ర్చి 1 నుండి రోజుకు లక్ష మంది కూలీ లు పనిచేసేలా లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, పులిచింతల నుండి 4 టీఎంసీల నీటి విడుదల జరగలేదని, మంచినీటి చెరువులు నింపా ల్సి ఉందని కలెక్టర్ ముఖ్యమంత్రికి వి వరించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు చేయాలి
పాతబస్తీ, ఫిబ్రవరి 19: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం రద్దు చేయాలని, తద్వారా ఉద్యోగుల కు న్యాయం చేయాలని కొరగంజి ఛా రిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొరగంజి జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డి మాండ్ చేస్తూ సోమవారం కొత్తపేట లో శ్రమశక్తి ట్రేడ్ యూనియన్ (ఎస్‌ఎస్‌టీయు) ఆధ్వర్యంలో వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ 30ఏళ్లకు పైగా ప్రభుత్వోద్యోగులుగా బాధ్యతలు నిర్వహించినవారు రిటైరైతే వారికి ఏమీ ఇవ్వని రీతిలో సీపీఎస్ వి ధానం ఉందన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎయుఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నాచౌక్‌లో జరిగే భారీ సభకు మద్దతుగా వన్‌టౌన్‌లో ఈ ర్యా లీ నిర్వహించామని చెప్పారు. కాగా కొత్తపేటలోని కేబీఎన్ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నెహ్రూ బొమ్మ సెంటర్, కోమల విలాస్ సెంటర్, బ్రాహ్మణవీధి, సైకం వారి వీధి మీదుగా అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్ వరకూ జరిగింది. ర్యాలీలో కొరగంజి ట్రస్ట్ సలహాదారులు చొక్కర శ్రీనివాసరావు, బెవర వెంకటరమణ, షేక్ హఫీజ్, తదితరులు పాల్గొన్నారు.