హైదరాబాద్

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న పిటీషన్లను స్వీకరించి, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె ఇన్‌చార్జి జేసీ నిఖిల, ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళావందనంతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వివిధ అంశాలకు సంబంధించిన పది పిటిషన్లను స్వీకరించారు. బన్సీలాల్‌పేటకు చెందిన సదాశివ రజక సంఘణ అధ్యక్షుడు దోభీఘాట్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. కార్వాన్, టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన బి.నరేశ్ అనే దివ్యాంగుడు తనకు ఏ ఆధారం లేదని, తన పనులు చేసుకోవటానికి వీలుగా ఉండేందుకు గాను తనకు బ్యాటరీతో నడిచే వాహానాన్ని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పలువురు వివిధ సమస్యలపై అర్జీలను అందజేశారు.

వర్గీకరణ సాధనకు ఉద్యమం ఉద్ధృతం
సికిందరాబాద్, ఫిబ్రవరి 20: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లును పెట్టాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాన మంత్రిని అమిత్‌షాను ఒప్పించి పార్లమెంట్‌లో బిల్లును పెట్టే విధంగా ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఏప్రిల్ 2న అమరావతిలో 10లక్షల మందితో తిరుగుబాటు సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. తిరుగుబాటు మహాసభ విజయవంతం చేయడానికి రెండు విడుతలుగా ప్రచార యాత్రలను చేపట్టి చైతన్యం తీసుకువస్తామని అన్నారు. ఈనెల 25న తిరుపతిలో మొదటి విడత ప్రచార యాత్రను ప్రారంభిస్తామని వివరించారు. 25 నుంచి మార్చి 1 వరకు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఏపీలో ప్రచారయాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో విడత మార్చి 21న చిత్తూరులో ప్రారంభించి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నామని అన్నారు. ఏప్రిల్ 2న 10లక్షల మందితో తిరుగుబాటు మహాసభను నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 24 ఏళ్లుగా సాగుతుందని చెప్పారు. సభకు సంకేతంగా తెలంగాణలో 24గంటల బంద్‌ను నిర్వహించనున్నామని వివరించారు. మార్చి 1 లేదా 2వ వారంలో బంద్ పిలుపు ఇస్తామని, బంద్ తేదిని 21న ప్రకటించనున్నామని పేర్కొన్నారు. బంద్‌కు మద్దతుగా నేడు రేపు అన్ని రాజకీయపక్ష నేతలను కలుస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారం కోరనున్నామని చెప్పారు. సీఎం కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోరుతూ నేడు లేఖ రాశానని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లును పెట్టేందుకు ఒత్తిడి తీసుకురావాలని కోరుతామని, బంద్‌కు విద్యార్థి, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ సంఘాల మద్దతును కోరుతామని పేర్కొన్నారు. సంఘాలతో వేర్వురుగా సదస్సులు, సమావేశాలు నిర్వహించి, న్యాయమైన వర్గీకరణకు మద్దతును కూడగడుతామని, ఈనెల 23నుంచి బంద్‌కు సన్నాహాలు చేయనున్నామని వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఏపీ అధ్యక్షుడు హరిబాబు నేతృత్వంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు
హయత్‌నగర్, ఫిబ్రవరి 19: అర్హులైన ప్రతీఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హస్తినాపురం డివిజన్ భూపేష్‌గుప్తనగర్‌లో సోమవారం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం ఖాళీ స్థలాన్ని మేయర్ రామ్మోహన్, ఎంపీ చామకూర మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు ఖాళీ స్థలంలో తమకు గత ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అక్కడ పార్కు, మల్టీలెవల్ ఫంక్షన్‌హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకే పనిచేస్తుందని, వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయదని అన్నారు. నందనవనంలో ఉన్న ఖాళీస్థలంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. అనంతరం లింగోజిగూడ డివిజన్ మజీద్‌గల్లిలో ఉన్న చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం రెండు ఎకరాల భూమిలో ఇళ్లు నిర్మించి వారికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మానాయక్, శ్రీనివాస్ రావు ఉన్నారు.
కొడంగల్ అభివృద్ధికి సీఎం పెద్దపీట
కొడంగల్, ఫిబ్రవరి 19: వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కొడంగల్ పట్టణ సర్పంచ్ వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ పాల్గొన్నారు. 4.98 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. 65 లక్షల రూపాయలతో ఓహెచ్‌ఎస్‌ఆర్ తాగునీటి ట్యాంక్‌ను, 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రా మ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గమని, అందుకు గతంలో మంజూరైన పనులు ఒక్కటీ చేయలేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నియోజకవర్గ అభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. దాదాపు 60 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, ఎంపీపీ కన్నం దయాకర్ రెడ్డి, జడ్పీటీసీ గొడల శరణమ్మ, మాజీ ఎంపీపీ ముద్దప్పదేశ్‌ముఖ్, ఎంపీటీసీ నందారం రాజేందర్ పాల్గొన్నారు.
కమనీయం.. స్వామివారి కల్యాణం
మేడ్చల్, ఫిబ్రవరి 19: మేడ్చల్ పట్టణం కిష్టాపూర్ రోడ్డులోని బ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణమహోత్సవం సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. యాదవ సోదరుల ఆరాధ్యదైవంగా కొలువబడుచున్న స్వామివారి ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండాలు, బోనాలు, ఒగ్గుకథ, తదితర కార్యక్రమాలు ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా నిర్వహించారు. ఆలయాన్ని పచ్చని తోరణాలు, విద్యు త్ దీపాలతో అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, నేతలు నందా రెడ్డి, రవీందర్ రెడ్డి, శేఖర్‌గౌడ్, మోహన్ రెడ్డి, న ర్సింహా స్వామి, శివకుమార్, నాగేంద ర్, శంకర్, కౌడే మహేశ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
ఉప్పల్, ఫిబ్రవరి 19: ఆర్టీసీలో పేస్కేల్స్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉప్పల్ బస్‌డిపో వద్ద ఉన్న వర్క్‌షాప్ గేట్ వద్ద భోజనం విరామ సమయంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు ఎస్‌ఎం ఇస్మాయిల్ నాయకత్వంలో జరిగిన ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీ.మురళీధర్, యూనిట్ కార్యదర్శి ధర్మరాజ్ పాల్గొని ప్రసంగించారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కావాల్సిన పేస్కేల్స్ ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడం శోచనీయమని అన్నారు. పేస్కేల్ అమలుపర్చడంలో గుర్తింపు ఉన్న టీఎంయూ ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. పని భారం పెరిగిపోయి కార్మికులు డ్యూటీలు చేయలేక విధి నిర్వహణలో ఒత్తిడితో మరణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బడ్జెట్‌లో 1500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి ఆర్టీసీని కాపాడాలని పేర్కొన్నారు. అక్రమ మూసివేతలను ఆపి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. తెలంగాణ సాధనలో అగ్రభాగాన నిలిచి రాష్ట్రాన్ని సాధించిన కార్మికులకు సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజినల్ నాయకులు శంకరయ్య, కపిల్, రాజు పాల్గొన్నారు.
లక్ష్మారెడ్డి చిరస్మరణీయుడు
చార్మినార్, ఫిబ్రవరి 19: తెలంగాణ సాధనలో చురుకైన పాత్ర పోషించిన లక్ష్మారెడ్డి చిరస్మరణీయుడని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీజేఏసీ నగర కమిటీ ఆధ్వర్యంలో టీజేఏసీ సభ్యుడు ఏలేటి లక్ష్మారెడ్డి సంస్మరణ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచేసిన కోదండరామ్ మాట్లాడుతూ, లక్ష్మారెడ్డి లేని లోటు తెలంగాణ సమాజానికి తీరదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన ఆశయ సాధనకుప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. అమరుల స్ఫూర్తిని, పోరాటాలను మరిచిపోరాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన మార్చి 10ని స్మరించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ టీజేఏసీ నగర కమిటీ అధ్యక్షుడు ప్రకాష్, జస్వంత్, గోవింద్ సింగ్, వినయ్, మధు, లక్ష్మారెడ్డి సతీమణీ రామలక్ష్మీ కుమార్తెలు వనజ, గీత పాల్గొన్నారు.