Others

మన వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలకు మంగళస్నానం చేయంచి
పదాలకు పట్టుపరికిణీలు తొడిగి
భావాలకు కస్తూరి తిలకాలు దిద్ధి
భావుకత్వ సామ్రాజ్యంలో
హంసతూలికా తల్పాలపై
అరమోడ్పు కన్నులతో ఒకప్పుడు
అలవోకగా శయనించిన
అనంత సౌందర్యరాశి మన తెలుగు
అలనాటి రాజెరాజు కంటికొసల
పసిడి పూల కలలమాల మన తెలుగు
పువ్వులలో పసిపాపల నవ్వులలో
అమ్మ ప్రేమ నయనమ్ముల మేల్ దివ్వెలలో
కమ్మని పాల బువ్వలలో వెలిగే
మువ్వపు నుడికారపు రవ్వ మన తెలుగు
మువ్వ మన తెలుగు
పూతపూసిన చిరుమావి వాసన
మన తెలుగు
మాతృభాషను గౌరవిద్దాం
అమ్మభాషను అందరితో పలికిద్దాం
ఘనమైన గత చరిత్రగా తెలుగును
విశ్వవ్యాప్తం చేద్దాం
తెలుగుకు గల తెగులును తరిమి కొడదాం
జై తెలుగు జయహోతెలుగు

(అంతర్జాతీయ మాతృభాషదినోత్సవ
సందర్భంగా)

- కామిడి సతీష్ రెడ్డి