Others

ధ్యాన ప్రజ్ఞోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మ అన్నదే సత్యం! ఆత్మ పదార్థమన్నదే సత్యం! సత్యమే ధర్మానికి నాంది. ధర్మంలో సుఖమూ.. సమస్తమూ ఉన్నాయి. ధర్మంలోనే మనశ్శాంతి! మనశ్శాంతిలోనే శారీరక ఆరోగ్యం! శారీరక స్వస్థత! శారీరక శక్తి!
ప్రపంచమంతా సుఖశాంతులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి! మనస్సును అదుపులో ఉంచుకోవడం సాధించాలి!
గౌతమబుద్ధుడు మనకెన్నో వరాలను ప్రసాదించారు. 2500 సం.ల క్రితమే ఆయన ఎంతో ఎంతో బోధించాడు. సర్వమూ బోధించాడు. మూడు అఖండమైన సందేశాలను ఆయన మనకిచ్చాడు- మూడు ఆదేశాలను మనకిచ్చాడు.
మొదటిది - ‘ఆనాపానసతి ధ్యానం’ - ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస!
రెండవది - మధ్యేమార్గం - అన్నింటిలోనూ మధ్యేమార్గం మాత్రమే అభిలషణీయం! ఎక్కువా లేదు - తక్కువా లేదు! మితమైన ధ్యానం - మితమైన ఆహారం - మితమైన విహారం! అతి సర్వత్ర వర్జయేత్!
మూడవది - అహింసా తత్త్వం - అహింసో పరమో ధర్మః
‘ఆనాపానసతి ధ్యానం’ అన్నపుడు గౌతమబుద్ధుడు ‘హంసా పరమో మోక్షః’ అన్నాడు. హింసను వదలాలి! హంసను - అంటే శ్వాసను పట్టుకోవాలి. ధ్యానం చేయాలి. ‘మధ్యేమార్గం’ అన్నపుడు జీవితంలో ఎలా జీవించాలో ఇహం మరి పరం చక్కగా కలగలిపి ఎలా ఉండాలో చెప్పాడు. భౌతిక జీవితం - ఆధ్యాత్మిక జీవితం; ఈ రెండూ సమపాళ్లలో రంగరిస్తేనే జీవితం సౌభాగ్యవంతమవుతుంది. ఇదే మధ్యేమార్గం. ‘అహింసా తత్త్వం మైత్రిదాయకం. కరుణా ధర్మం క్రాంతిక్షేత్రం. ఎవరైతే హింసా తత్త్వంలో ఉంటారో వాళ్లకు అందరూ శత్రువులే. ఎవరైతే అహింసా తత్త్వంలో ఉంటారో సర్వప్రాణికోటి వాళ్లకు మిత్రులే.
సమస్త ప్రాణికోటిలో మిత్రుత్వమే దివ్యత్వం
మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల ‘కరుణ’ చూపించాలి. అదే కరుణా ధర్మం. ఏసు ప్రభువు ఎంతటి కరుణామయుడు. మదర్ థెరిసా ఎంతటి కారుణ్యమూర్తియో! శిబి చక్రవర్తి ఎంతటి కరుణా సాగరుడు! మరి మనం కూడా అంత కరుణామయులం కావాలి! కరుణాధర్మమే క్రాంతి క్షేత్రం.
ఎంత భాగ్యమో! ఎంత సౌఖ్యమో! బుద్ధ యోగమూ - ధ్యాన జీవితము! ఇవి బుద్ధుడు చెప్పిన మూడు సందేశాలు - ఆదేశాలు.
ఒక దేవుడి పటాన్నో ఒక బుద్ధుడి బొమ్మనో, ఏ కృష్ణుడి శిల్పాన్నో చూసినపుడు... ఆ తల చుట్టూ ఓ గుండ్రటి వెలుగు నేపథ్యాన్ని మీరు చూసే ఉంటారు. ఆ వృత్తాకారపు వెలుగు ఉండడం సత్యమే. దీనినే ‘ఆరా’ అంటారు. ధ్యానంలో మీరు నిష్ణాతులయితే ఈ ‘ఆరాలు’ మీలో కూడా విస్తరిస్తాయి. ఎదుటి వారి ‘ఆరాలు’ మీరు కూడా చూడగలుగుతారు.
కనీసం ఓ వాడిపోయిన పువ్వు కూడా కనిపించకుండా ఓ చెట్టు నుండి రాలుతున్న ఆకు కనిపించకుండా, గౌతముడిని ఇరవై తొమ్మిది సం.లు గోప్యంగా పెంచాడు తండ్రి శుద్ధాదన మహారాజు. అనుక్షణం అప్రమత్తతతో ఆయన సిబ్బంది ఉద్యానవనంలో మొత్తంగా ఒక్క ఎండుటాకు కూడా, ఒక్క వాడిపోయిన పువ్వు కూడా కనిపించకుండా అనే్నళ్లు ప్రతిరోజూ ఇదంతా చెయ్యాల్సి ఉండేది ఆయనకు, ఆయన సిబ్బందికి.
జీవితానికి ఒక అంతం ఉందన్న విషయం, మరణం ఉంటుందన్న విషయం కూడా గౌతముడికి తెలియకుండా పెంచడం శుద్ధ్ధోన మహారాజుకు తలకు మించిన పనే అయి ఉంటుంది. అయితే, ఈ కట్టుదిట్టాలే సృష్టించాయి బుద్ధుడి యవ్వనంలో జరగవలసి ఉన్న వాటంతటికీ. నిరంతరంగా అనుభవిస్తున్న సౌఖ్యాలవల్ల మొహం మొత్తిపోయింది అతడికి. ఎందరో అందమైన అమ్మాయిలు చుట్టూ ఉండి, వైభోగ సౌకర్యాలుండి, అంతులేని అనుచర వర్గ సేవలుండి ఇరవై తొమ్మిదేళ్లకే జీవితంలో ‘మనోవార్థక్యం’ వచ్చేసింది గౌతముడికి. -సశేషం

-మారం శివప్రసాద్