తెలంగాణ

మెట్రో.. మరింత వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచాలని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్రో కారిడార్లలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు రెండవ దశపై దృష్టి సారించాలన్నారు. అలాగే ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో నిర్మాణానికి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. మెట్రోరైలు భవన్‌లో మంగళవారం మెట్రో రైలుపై మంత్రి సమీక్షించారు. మెట్రోరైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగాన్ని పెంచాలని ప్రజల నుంచి సూచన వస్తుందని మంత్రి వివరించారు. త్వరలోనే ఫ్రీక్వెన్సీని పెంచడంతో పాటు వేగాన్ని కూడా పెంచుతామని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఇతర మెట్రో రైళ్లతో పోల్చితే హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే ప్రయాణికుల సంఖ్య ఉందన్నారు. చెన్నై మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య వివరాలను ఆయన వివరించారు. మెట్రో రైలుతో ఆర్టీసీకి అనుసంధానం చేసే ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సెట్విన్ బస్సులతో పాటు వంద ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. మెట్రో కారిడార్లలో పార్కింగ్, ఫుట్‌పాత్, రోడ్లు తదితర వౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పార్కింగ్ సదుపాయంతో పాటు 12 మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలకు టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. ఉప్పల్ స్టేడియం నుంచి మెట్రో స్టేషన్ వరకు స్కైవాక్ నిర్మాణానికి స్టేడియం నిర్వాహకుల నుంచి ప్రతిపాదన అందిందని మంత్రి తెలిపారు. ప్రతీ మెట్రో స్టేషన్‌లో షీ టాయిలెట్స్ నిర్మించాలని మంత్రి ఆదేశించారు.
chitram...
రెండో దశ మెట్రో పనులపై అధికారులతో సమీక్షిస్తున్న కేటీఆర్