తెలంగాణ

మీ-సేవకు విట్సా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో తెలంగాణ మరోమారు మెరిసింది. టెక్నాలజీలో వేగంగా ఎదుగుతున్న తెలంగాణలో ‘మీ సేవ’ సర్వీసులకు ప్రతిష్టాత్మక విట్సా అవార్డు దక్కింది. విట్సా 2018 గ్లోబల్ ఐసిటి అవార్డులను మంగళవారం ప్రకటించారు. అవార్డును ఐటీ మంత్రి కెటి రామారావు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సమక్షంలో ఇఎస్‌డి కమిషనర్ జిటి వెంకటేశ్వరరావు అందుకున్నారు. అందులో 2018 చైర్మన్ అవార్డు ఎలాక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ పేరిట మీ సేవ సర్వీసులకు ఈ అవార్డు దక్కింది. అలాగే 2018 చైర్మన్ అవార్డు-2 తుమో సెంటర్ క్రియేటివ్ టెక్నాలజీస్‌కు దక్కింది. 2018 పబ్లిక్ సెక్టార్ ఎక్స్‌లెన్స్ అవార్డు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ ఐసిటి కొరియాకు దక్కింది. 2018 ప్రైవేటు సెక్టార్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఏసర్ ఐటిఎస్ ఇన్‌కార్పొరేషన్‌కు దక్కింది. 2018 సస్టైనబుల్ గ్రోత్ అవార్డు ఎస్‌ఎస్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీకి దక్కింది. డిజిటల్ ఆపర్చ్యునిటీ అవార్డు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌కు, ఇన్నోవేటివ్ హెల్త్ సొల్యూషన్స్ అవార్డు ఇన్ఫర్మేషన్ సొసైటీ ఎస్‌ఎకు దక్కింది. ఎమర్జింగ్ డిజిటల్ సొల్యూషన్స్ అవార్డు నెస్‌ప్లోరాకు దక్కింది.