క్రీడాభూమి

టెస్టులు, వనే్డలలో రెండో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఫిబ్రవరి 20: భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రంగా వినుతికెక్కిన విరాట్ కోహ్లీ ఐసీసీ ప్రకటించిన తాజా జాబితాలో టెస్టులు, వనే్డలలో ప్రపంచంలో రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ జాబితాలో కోహ్లీ 900 పాయింట్లు దాటి ప్రపంచ క్రికెటర్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. అదేవిధంగా భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వనే్డలలో బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో చోటు దక్కించుకున్నాడు. టెస్టులు, వనే్డలలో సాధించిన ఘనతతో ఐసీసీ ప్రకటించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సరసన కోహ్లీ 900 పాయింట్లతో నిలిచాడు. 29 ఏళ్ల విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో 5-1 తేడాతో అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి 558 పరుగులు సాధించాడు. గత నెలలోనే కోహ్లీ అగ్రశ్రేణి క్రికెటర్ బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు. వనే్డ మ్యాచ్‌లలో కోహ్లీ ఒకేసారి ఏడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వివియాన్ రిచర్డ్‌సన్ 935 పాయింట్ల అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో 16 వికెట్లు తీయడం ద్వారా ఆఫ్గనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరసన చేరాడు.

కామ్‌నె్వల్త్ క్రీడలకు
మారిన డ్రెస్ కోడ్
ప చీరలకు బదులు కోట్లు, ప్యాంట్లతో దర్శనమివ్వనున్న అథ్లెట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఇలా ఏ అంతర్జాతీయ టోర్నమెంట్‌కైనా భారత క్రీడాకారిణులు చీరకట్టుతో జాతీయ పతాకాలను చేత పట్టుకుని ప్రారంభ వేడుకల రోజు సందడి చేసేవారు. ఇకనుంచి వారు ఆ సంప్రదాయానికి మంగళం పలకనున్నారు. చీరలకు బదులు కోట్లు, ప్యాంట్లు ధరించి కనిపిస్తారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో కామనె్వల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభ వేడుకల్లో భారత బృందంలోని మహిళా క్రీడాకారిణులు ఎప్పటిలాగే చీరలు ధరించడంలేదు. వాటి స్థానంలో కోట్లు, ప్యాంట్లు ధరించనున్నట్లు ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపాడు. అథ్లెట్లను సంప్రదించిన తరువాతనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపాడు. ఏ క్రీడోత్సవాలైన వాటికి సంబధించిన ప్రారంభ వేడుకలు మూడు, నాలుగు గంటలు పడుతుందని, దీంతో మహిళా అథ్లెట్లు కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన వివరించాడు. అంతేకాకుండా భారత జట్టులో ఉన్న అమ్మాయిలకు చీర కట్టుకోవడం రాదు. తోటి వారి సాయం తీసుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కామనె్వల్త్ గేమ్స్‌లో మహిళా అథ్లెట్‌లు వివిధ ప్రాంతాలలో జరుగనున్న క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో చీరలకు బదులు కోట్లు, ప్యాంట్లు ధరించేలా నిర్ణయం తీసుకున్నామని రాజీవ్ వివరించాడు. కోట్లు, ప్యాంట్లు ధరించడం వల్ల తమకు చాలా సమయం ఆదా అవుతుందని, అంతేకాకుండా చాలా హాయిగా ఫీలవుతామని షూటర్ హీనా సిద్దు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
క్రికెట్‌కు పీటర్సన్ గుడ్‌బై
కరాచీ, ఫిబ్రవరి 20: ఇంగ్లాండ్ క్రికెట్ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ తన క్రీడా జీవితానికి గుడ్‌బై చెప్పనున్నాడు. దుబాయిలో వచ్చే గురువారం నుంచి జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ థర్డ్ ఎడిషన్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని ప్రకటించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఆయన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రాంలో పీటర్సన్ తన ఫొటోతో కూడిన పోస్టింగ్ ఉంచాడు. పీటర్సన్ వచ్చేనెలలో లాహోర్, కరాచీలో జరిగే రెండు ప్లే ఆఫ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లలో ఆడేందుకు విముఖత చూపాడని క్వెట్టా గ్లాడియేటర్ యజమాని నదీమ్ ఒమర్ పేర్కొన్నాడు.

అయితే, చివరి నిమిషం వరకు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు.