క్రీడాభూమి

‘మరింత క్రియాశీలకంగా ఆడతాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 20:్భరత్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో తమ జట్టు అనుకున్న స్థాయిలో, సమర్థంగా బౌలింగ్ చేయలేకపోయిందని ఆ జట్టు కీలక పేస్ బౌలర్ జూనియర్ దాల అంగీకరించాడు. రెండో మ్యాచ్‌లో మరింత క్రియాశీలకంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందని అతడు ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సరికొత్త వ్యూహాన్ని రచించామని, అయితే దానిని అనుకున్నట్లుగా అమలు చేస్తే ఫలితం సాధించగలమని చెప్పాడు. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా జోహెనె్నస్‌బర్గ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గి 1-0 ఆధిక్యత సాధించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం ఇక్కడ ఇరు జట్లూ రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో భారత్‌ను కట్టడి చేసి విజయం సాధించడానికి తగిన వ్యూహం రచించామని, అయితే దానిని అమలు చేయడమే కీలకమని దాల చెప్పాడు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా షార్ట్‌పిచ్ బంతుల వ్యూహాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న భారత్ పవర్‌ప్లేలో 75 పరుగులు రాబట్టి విజయాన్ని సాధించింది. కాగా ఈసారి తమ వ్యూహం మారిందని, మరింత క్రియాశీలంగా దానిని అమలు చేయాల్సి ఉంటుందని అతడు చెప్పాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన దాల, టీ-20 మ్యాచ్‌లలో పిచ్ స్వభావాన్ని అంచనా వేయడమే కీలకమని, డేన్ పేటర్సన్, క్రిస్ మోరిస్ బౌలింగ్ కీలకమన్న దాల పవర్‌ప్లేలో రన్‌రేట్‌ను తగ్గించేలా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. బౌలింగ్ వ్యూహంలో అవసరాన్నిబట్టి ఎప్పటికప్పుడు కోచింగ్ విభాగం మార్పులు చేస్తుందన్న దాల తమ జట్టులో యువ క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని, అది కలిసొచ్చే అంశమని చెప్పాడు. భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. తొలి టీ-20 మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు విడిచిపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
మరోవైపు దక్షిణాఫ్రికా వనే్డ, టీ-20 జట్టులో చోటు దక్కించుకున్న కొత్త ఆటగాళ్లలో దాల ఒకరు. వాండరర్స్‌లో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన దాల రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ల వికెట్లు పడగొట్టి అందర్నీ ఆకర్షించాడు. కాగా బుధవారం నాటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్‌ను నెగ్గడం ద్వారా సిరీస్‌ను శనివారం మ్యాచ్‌వరకు సజీవంగా ఉంచాలన్నది దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యం.