క్రీడాభూమి

టీ-20 సిరీస్‌పై కోహ్లీ సేన కన్ను నేడు దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 20: దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటికే వరుస విజయాలతో రాకెట్‌లా దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ సేన ఇపుడు మరో సిరీస్‌పై దృష్టి సారించింది. టెస్టు సిరీస్‌లో 1-2 ఓటమికి ప్రతీకారంగా అదే ప్రత్యర్థిని వనే్డలలో 5-1 తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుని సత్తా చాటిన భారత్ ఇపుడు జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లలో కూడా అదే దూకుడు ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే జోహానె్సస్‌బర్గ్‌లో జరిగిన టీ-20 ప్రారంభం మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన భారత్ బుధవారం సెంచూరియన్‌లో జరిగే రెండో టీ-20ని కూడా దక్కించుకునేందుకు శతధా ప్రయత్నాలు చేస్తోంది. రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన గెలుపు సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై వనే్డ, టీ-20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించాలని గట్టి పట్టుదలతో ఉంది. టీ-20 రెండో మ్యాచ్‌లో గెలిస్తే మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్ పరంగా భారత్ రెండో స్థానానికి ఎగబాకుతుంది. అయితే, బుధవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టీ-20 ట్రై సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాను ఓడిస్తే కోహ్లీ సేన ఎప్పటిలాగే మూడో స్థానంలోనే ఉంటుంది.
కోహ్లీ ఆడతాడా? లేదా?
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్నపుడు స్వల్పంగా గాయపడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అన్న మీమాంశ కొనసాగుతోంది. అయితే, జట్టు యాజమాన్యం నుండి ఎలాంటి ఈ విషయమై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కోహ్లీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డర్బన్‌లో జరిగిన వనే్డలో ఫీల్డింగ్ చేసినపుడు గాయపడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంటే స్వల్ప గాయాన్ని కూడా లెక్కచేయని కోహ్లీ ఆటపైనే దృష్టి సారించాడన్నది సుస్పష్టం.
ఇదిలావుండగా, కేప్‌టౌన్‌లో జరిగే టీ-20 ఫైనల్ మ్యాచ్ తర్వాత, వచ్చే మూడు నెలలపాటు జరిగే ఐపీఎల్, ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో కోహ్లీకి జట్టు యాజమాన్యం విశ్రాంతి ఇవ్వదలిస్తే అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకునే అవకాశం ఉంది. తొలి టీ-20 మ్యాచ్‌లో సహచర జట్టు సభ్యుడు మనీష్ పాండే కోసం రాహుల్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో భారత్ జట్టు పేసర్లను నమ్ముకుని వారిని రంగంలోకి దింపడం ద్వారా మంచి ఫలితాలను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు జరిగే రెండో మ్యాచ్‌లో పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జయదేవ్ ఉనద్కత్ జట్టు విజయానికి ఎంతో దోహదపడ్డాడు. రెండో మ్యాచ్ జరిగే సెంచూరియన్‌లోని సూపర్‌పోర్ట్ పార్క్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న ఆలోచన నేపథ్యంలో స్నిన్నర్ల ద్వయం కుల్దీప్ యాదవ్, రాహుల్‌కు మరోసారి చాన్స్ దక్కనుంది.
దక్షిణాఫ్రికాకు చావో రేవో...
పోర్ట్ ఎలిజబెత్‌లో గత మంగళవారం జరిగిన మ్యాచ్ అనంతరం మొదటి టీ-20లో ఘనవిజయం నేపథ్యంలో భారత్ సేన రెండో మ్యాచ్‌పై గెలుపు సాధించే దిశగా రెట్టించిన ఉత్సాహంతో ఉండగా, మరోవైపు ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ చావో రేవోగా భావిస్తోంది. ఈ జట్టులో ప్రధాన ఆటగాడు ఏబీ డివిలియర్స్ గాయం కారణంగా తొలి టీ-20 మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో, అతని స్థానంలో ఎవరినీ జట్టులోకి తీసుకోలేదు.
అయితే, కెప్టెన్ జేపీ డుమినీ జట్టులో మిగిలిన సభ్యులతోనే ఆడించడం ద్వారా మంచి ఫలితం కోసం తన ప్రయత్నాలు చేస్తున్నాడు.
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ఎం.ఎస్.్ధనీ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్.
దక్షిణాఫ్రికా: జేపీ డుమినీ (కెప్టెన్), బెహార్డిన్, జూనియర్ డాలా, రీజా హెండ్రిక్స్, క్రిస్టియన్ జోన్కర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, డేన్ ప్యాటర్సన్, ఆరోన్ ఫాంగిసో, ఆండిలో ఫెహ్లుక్వాయో, తబ్రీజ్ షంషీ, జోన్ జోన్ స్మట్స్.

జట్టులో చోటు దక్కలేదని

యువ క్రికెటర్ ఆత్మహత్య

ప కోచే కారణమన్న మృతుడి తండ్రి, మాజీ క్రికెటర్ అమీర్ హనీఫ్

లాహోర్, ఫిబ్రవరి 20: మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తనకు అవకాశం రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన యువ క్రికెటర్ బలవన్మరణం చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో సోమవారం జరిగింది. అమీర్ హనీఫ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1990 దశకంలో పాక్ వనే్డ జట్టులో సభ్యుడిగా కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. హనీఫ్ పెద్ద కుమారుడు మహ్మద్ జర్యాబ్. ఇటీవల లాహోర్ నిర్వహించిన ఓ టోర్నమెంట్‌లో కరాచీ అండర్-19 టీమ్ తనపున జర్యాబ్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.
కానీ గాయం కారణంగా జర్యాబ్ టోర్నీ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. గాయం కోలుకున్నాక మళ్లీ చాన్స్ ఇస్తామని జర్యాబ్‌కు కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. అయితే తాజాగా జరిగిన పాక్ అండర్-19 టీమ్ ఎంపికలో జర్యాబ్‌ను పక్కనపెట్టారు. వయసు ఎక్కువగా ఉందన్న కారణంగానే ఎంపికలో జర్యాబ్‌ను పక్కనపెట్టారు. వయసు ఎక్కువగా ఉందన్న కారణంగానే ఎంపిక చేయలేదని కారణం చెప్పడంతో జర్యాబ్ తీవ్ర మనస్తాపానికి లోనై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నడని అతడి తండ్రి మాజీ క్రికెటర్ అమిర్ హనీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాక్ అండర్-19 రికార్డుల ప్రకారం జర్యాబ్ ఇంకా 19 ఏళ్ల వయసు రాలేదని, తమ కుమారుడి మృతికి కోచ్, క్రికెట్ ఉన్నాతాధికారులు కారణమని హానీఫ్ ఆరోపించారు. అండర్-19 క్రికెట్ జట్టులో ఆవకాశం రాలేదని, కావాలనే సెలెక్టర్లు తనకు తీరని అన్యాయం చేశారని, దీంతో తీవ్ర మనస్తాపానికి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. వివరాల్లోకి వెళ్తే.. హనీఫ్ కుమారుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మహ్మద్ జర్యాబ్‌ను గాయం కారణంగా జట్టు సెలెక్టర్లు అతనిని ఇంటికి పంపారు. దీంతో మనస్తాపానికి గురైన జార్యాబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి హానీఫ్ తమపై చేసిన ఆరోపణలు సెలెక్టర్లు ఖండించారు. తాము కావాలనే తమ కుమారుడిని ఇంటికి పంపలేదని, అతని ఫిట్నెస్ బాగుంటే జట్టులోకి తీసుకుంటామని హామీఇచ్చామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మాజీ క్రికెటర్ హనీఫ్ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరారు.