Others

పోలీసు వ్యవస్థ మారదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రానంతరం పోలీసు వ్యవస్థలో మార్పులు తేవడానికి ప్రభుత్వం కొన్ని పనులు చేసింది. కాని అవి అంతగా సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ‘పోలీసులు మీ మిత్రులు, వారి వద్దకు వెళ్లి నిర్భయంగా ఫిర్యాదు చేయండి.. పోలీసు స్టేషన్లు దగ్గరగానున్న న్యాయస్థానాలవంటివి’ అని ప్రభుత్వం చాలాకాలంగా చెబుతోంది. వాస్తవంగా అదేమీ జరగడం లేదు. చాలా స్టేషన్‌లలో గాంధీజీ చిత్రాలుంటాయి. కొన్నిచోట్ల అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వారి చిత్రపటాలుంటాయి. ‘సత్యమేవ జయతే’ అనే సూక్తికూడా అక్కడి గోడలపై కనిపిస్తుంది. ఇవన్నీ అలంకార ప్రాయాలే. వీలయినంత వరకు ప్రజలు ఎవరూ పోలీసు స్టేషన్లకు వెళ్లరు. పోలీసులు ఎవరి ఇంటికైనా వస్తే అది పెద్ద అవమానం. ఏ పనిమీద వారు వచ్చినా ఆ ఇంట్లో ఎవరో నేరస్థులు ఉండి ఉంటారని చుట్టుప్రక్కల వారు అనుమానిస్తారు.
పూర్వం గ్రామ స్థాయిలో తగాదాలను గ్రామ మునసబులు హుందాగా పరిష్కరించేవారు. ఆ వ్యవస్థ రద్దయింది. న్యాయం కావలసినవారు న్యాయస్థానాలను ఆశ్రయించాలి. దురదృష్టవశాత్తూ నేటి విధానంలో అందుకు అవకాశం లేదు. కనుక న్యాయమూర్తికి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేయవలసినవారు పోలీసు స్టేషన్‌కే వెళ్లాలి. అక్కడకు వెళితే జవాబుదారీతనం లభించదు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తిని ఇటీవల పోలీసులు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇతర ఆఫీసులలోకి వెళ్లినపుడు పని జరగకపోతే అక్కడే అందుబాటులో ఉన్న పైఅధికారికి చెప్పవచ్చు. పోలీసు స్టేషన్‌లో ఈ అవకాశం లేదు. కనుక ప్రతి పోలీసు స్టేషన్‌లోను ఇద్దరు లేక ముగ్గురు న్యాయవాదులు విధిగా ఉండాలి. నేరస్థులను, ఫిర్యాదుదారులను పోలీసులు వారికి అప్పగించాలి. వారు విచారణ చేసి తగిన నిర్ణయం తీసుకుంటారు. నేరంతో సంబంధం లేకున్నా కొందరిని స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారిస్తున్నారు. అలాంటివారు కొందరు అది అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంటున్నారు.
కొన్ని స్టేషన్లలో నిందితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. నాగరిక సమాజంలో ఈ పద్ధతి ఎంతమాత్రం పనికిరాదు. చిత్రహింసలను తాళలేక కొందరు మరణిస్తున్నారు. మానవ హక్కుల సంఘం వారికి ఇలాంటి విషయాలలో బాధ్యత లేదు కాబోలు. ఇలాంటి మరణాలకు కారకులైన వారిని తీవ్రంగా దండించినట్లు ఎప్పుడూ వినలేదు. అలా ఎక్కడైనా జరిగితే తప్పక ప్రశంసించాలి. ఇపుడు విచారణ విషయంలోనే పూర్తి మార్పులు రావాలి. సివిల్ తగాదాలన్నీ న్యాయవాదులే పరిష్కరించాలి. క్రిమినల్ కేసులు, దొంగతనాల కేసులు, స్ర్తిలను అవమానించిన కేసులు పోలీసులు న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి. కాగా, అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై పోలీసు స్టేషన్‌లో కేసులు దాఖలు చేసినట్లు మీడియాలో చూస్తున్నాం. ఇదేం పద్ధతి? సదరు ఫిర్యాదు న్యాయవాదుల ద్వారా న్యాయమూర్తికి చేయకూడదా? ఇందుకు ఏమైన అభ్యంతరాలున్నాయా? ఏమైనా ఉంటే వాటిని తక్షణం తొలగించాలి. దొంగిలించిన సొత్తు ఎవరికి అమ్మినది తెలిసినప్పుడు కొన్నవారిని కూడా విధిగా శిక్షించడానికి చర్యలు తీసుకోవాలి.
ప్రతి గ్రామంలోను మైక్‌ల వల్ల, బాణసంచా వల్ల ప్రజల చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఈ విషయం ఎవరూ ఫిర్యాదు చేయరు. ‘మాకు ఫిర్యాదు రాలేదు’ అనే సాకుతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే పల్లెలలో కూడా సాయంత్రం సమయంలో రద్దీ పెరిగిపోయింది. దీనిని నియంత్రించడానికి తగిన సిబ్బంది లేదని పోలీసువారు చెప్పవచ్చు. ఈ విషయం కూడా ఆలోచించి కనీసం మూడు రోజులకైనా అలాటి చోట్లకు హోమ్‌గార్డులను పంపే విషయం ఆలోచించాలి. గ్రామ స్థాయిలో కమిటీని వేసి తగవులు పరిష్కరించుకోవచ్చునని కొందరు సూచిస్తున్నారు. ఇది మంచిదే కాని ఆచరణ సాధ్యమా? గ్రామంలో పంచాయితీలున్నాయి. సర్పంచ్‌లు, సభ్యులు తగాదాలు పరిష్కరించాలి. పరిష్కారం కాని తగాదాలు గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా స్టేషన్‌కు వెళ్లాలి. ఇలాంటి విషయాలను కూలంకషంగా పరిశీలించి తగిన మార్పులు చేయడానికి న్యాయ కోవిదులతో కమిటీ ఏర్పాటుచేసి పోలీసు వ్యవస్థలో తగిన సంస్కరణలు చేపట్టి, వాటిని ప్రభుత్వం ఆచరణలో అమలు చేయాలి.

-వేదుల సత్యనారాయణ