బిజినెస్

మూడోరోజూ నష్టాలే దేశీయ మార్కెట్లలో అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:డాలర్‌తో రూపా యి మారకం విలువ తగ్గడం, పీఎన్‌బీ కుంభకోణంపై చురుకుగా సాగుతున్న విచారణ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తపడటంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. మం గళవారం లావాదేవీలు లాభాల దిశగా ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికి నష్టాలనే మిగిల్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మూడునెలల కనిష్ఠానికి, 64.88కు తగ్గిపోవడంతో భారీ నష్టాలు ఏర్పడ్డాయి. సెనె్సక్స్ 186 పాయిం ట్లు కోల్పోయి 33,960.95 పాయింట్ల వద్ద కొం తసేపు ఊగిసలాడి ఆ తరువాత 33,657కు పడిపోయింది. సాయంత్రానికి 71.07 పాయింట్లు నష్టపోయి 33,703.59 పాయింట్ల వద్ద స్ధిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా నేలచూపులే చూసింది. ఉదయం లాభాల దిశగా అడుగులు వేసిన 10,360.40 - 10,429.35 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18 పాయింట్లు కోల్పోయి 10,360.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లలో మంగళవారం ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని షేర్లు భారీగా పతనమైనాయి. ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల విలువ గత రెండు రోజులతో పోలిస్తే కాస్తంత మెరుగుపడగా ఐటీ సంస్థలు లాభాలు గడించాయి.

మార్కెట్‌లోకి జీసీసీ షర్బత్‌లు
విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఆరోగ్యానికి మేలు చేసే జీసీసీ షర్బత్‌లు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. వచ్చేనెల మొదటి వారం నుంచి వేసవి సీజన్ ముగిసే వరకు జీసీసీ బ్రాండ్‌తో తయారు చేసే నన్నారి, బిల్వ, త్రిఫల షర్బత్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నామని విశాఖలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో వైస్-చైర్మన్ రవిప్రకాష్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేసిన విషయంపై చర్చించారు. ఇప్పటికే అనేకసార్లు సంస్థ అధికారులతో వైస్-చైర్మన్ రవిప్రకాష్ రాష్టస్థ్రాయిలో సమీక్షలు నిర్వహించారు. వేసవితాపాన్ని తీర్చే, సహజసిద్ధమైన అటవీ ఉత్పత్తులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లు గత రెండేళ్ళుగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన సంస్థ ఈ ఏడాది వేసవి సీజన్‌లో పూర్తిస్తాయిలో టెట్రాప్యాక్‌లను విరివిగా విక్రయించాలని నిర్ణయించింది.