జాతీయ వార్తలు

లింగవివక్షను తుడిచేద్దాం కెనడా ప్రధాని సతీమణి పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: సమాజం నుంచి లింగవివక్షను పారదోలాలని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో భార్య సోఫి గ్రెగోరే ట్రుడో పిలుపునిచ్చారు. పురుషలు, స్ర్తిలు అన్న వివక్ష వల్ల ప్రపంచ ఎంతో కోల్పోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘సమాజంలో అన్ని వర్గాలూ లింగవివక్షకు వ్యతిరేకంగా నిలబడాలు. సమానత్వాన్ని చాటాలి’ అని ఉద్ఘాటించారు. దక్షిణ ముంబయిలోని సోఫియా మహిళా కళాశాలను సందర్శించిన ఆమె ‘సమాజంలో ఓ దురాభిప్రాయం వేళ్లూనుకుపోయింది. మగ పిల్లలకంటే బాలికలను చిన్నచూపుచూడడం మామూలైపోయింది. ఈ పద్ధతి మారాలి. మార్పుకోసం అందరూ కృషి చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఏ విధంగా చూసినా మహిళ శక్తి, సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయలేమని సోఫి చెప్పారు. స్ర్తి శారీకంగా బలహీనురాలు కాదని, ఆమె ధృడ సంకల్పం ముందు మగవాళ్లు తక్కువేనని అన్నారు. ధైర్య సాహసాలు, పట్టుదల మగవాళ్లకు ఎలాగో మహిళలకూ అంతకంటే ఎక్కువే ఉంటాయని చెప్పారు. 8 రోజుల పర్యటన నిమిత్తం కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌కు వచ్చారు. జస్టిన్ భార్య సోఫి (42) టీవీలో వ్యాఖ్యాతగా పనిచేశారు. అలాగే మహిళల హక్కులకోసం పోరాడుతున్నారు. విద్యతోనే లింగవివక్ష తగ్గుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
chitram...
ముంబయిలోని సోఫియా మహిళా కళాశాలకు వచ్చిన కెనడా ప్రధాని సతీమణి సోఫి గ్రెగోరే ట్రుడోకి నుదుట కుంకుమ దిద్దుతున్న ఓ విద్యార్థిని