సబ్ ఫీచర్

అడగగలటమూ ఆధ్యాత్మికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు అనంత కరుణాంతరంగుడు. భక్తులు ఏమడిగినా ఠక్కున నిండుగా దండిగా, మెండుగా ఇచ్చేస్తాడు. దయా సింధువు. భక్తులకు ఎప్పుడూ ఏదో ఒకటి ఇద్దామనే దయతో నిండి ఉంటుంది ఆయన హృదయం. అయితే భక్తుడు భగవంతుడ్ని అడగాలి. అడగగలగాలి. ఏమిటి అడగారో తెలుసుండాలి. భగవంతుడ్ని ‘‘వరం’’ అడగటమూ ఒక కళే. ఎందుకంటే ఏమి అడగాలో తెలియాలంటే మనకి ఏమి కావాలో పూర్తిగా తెలిసి ఉండాలి.
‘‘అడిగిని వానికి అడిగినవన్నీ ఇస్తాడు భగవంతుడు. అడగని వానికి అతనికి ఏమి కావాలో అదిస్తాడు భగవంతుడు’’ అంటారో మహనీయుడు.
అక్కడే ఉంది ఆధ్యాత్మికమంతా!ఆధ్యాత్మిక తత్త్వమంతా!!.. భగవంతుని తత్త్వమంతా!!
ఓ దంపతులుండేవారు. ఎన్నో విధాలుగా మరెన్నో రకాలుగా జీవితాన్ని నెట్టుకు రావాలని ప్రయత్నాలు చేసేరు. ఏ ఒక్కటీ వాళ్లకి కలిసిరాలేదు. వాళ్లేమి చేసినా కిట్టుబాటు అవడం లేదు. చివరకు బ్రతుకుతెరువు కొరవడి పోయింది. ఎలా తమ బతుకులు నెట్టుకురావాలో తెలీని పరిస్థితిలో ఆ దంపతులు నలిగిపోతున్నారు. రోజురోజుకి బతుకు దుర్భరమైపోతోంది. ఎనె్నన్నో చేసినా కాలం, అదృష్టం కలిసిరాక ప్రతి పనిలోను నష్టాలు, కష్టాల పాలైపోతున్నారు. భవిష్యత్ అంధకారంగా గోచరిస్తోంది.ఆ దంపతులలో భార్యం కొంచెం తెలివైంది. ‘‘లౌకికం’’ తెలిసినది. ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. ఓ మార్గం దొరికినందుకు బాగా సంతోషించి, తనకొచ్చిన ఆలోచనని భర్తకి చెప్పింది. ఏమి చేసినా మనకి దుఃఖమే మిగుల్తోంది. కాబట్టి మనం ఇంకేమీ చేయొద్దు. భగవంతుడి కోసం ఇద్దరం తపస్సు చేద్దాం. మన తపస్సుకి మెచ్చి ఆ భగవంతుడు తప్పక ప్రసన్నుడవుతాడు. అప్పుడు.. ఆయనే్న అన్నీ అడిగేద్దాం అని భర్తకి చెప్పింది. భార్య ఆలోచన భర్తకి కూడా బాగా నచ్చింది. వెంటనే మంచి ప్రదేశం చూసుకుని ఇద్దరూ భగవంతుని కోసం తపస్సు మొదలుపెట్టేరు. మంచి భక్తిప్రపత్తులతో తపస్సు చేసేరు. భగవంతుడు ఆ తపస్సుకి ఆనందపడ్డాడు. పరవశుడయ్యేడు. ప్రసన్నుడయ్యేడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు.
మీ ఇద్దరి తపస్సుకి మెచ్చేను!! మీకు మీరనుకుంటున్నట్టు ఒక వరం కాదు మూడు వరాలు ఇస్తాను. కోరుకోండి అన్నాడు భగవంతుడు.
అప్పుడొచ్చింది అసలు చిక్కు. భగవంతుడ్ని ఏమి కోరుకోవాలి? ఏమి కోరుకుంటే ఏమి కష్టమో, ఏమి నష్టమో తెలీక దంపతులిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటున్నారు. భగవంతుడికి వాళ్ల పరిస్థితి అర్థమయ్యింది. ‘‘ఏం పర్వాలేదు. నేను ఇక్కడే మీ ముందు ఉంటాను. బాగా ఆలోచించుకుని కోరుకోండి’’ అని చెప్పేడు భగవంతుడు.
ఒక్కొక్కరుగా, ఇద్దరూ కలిసి ఏమి కోరుకోవాలో ఆలోచిస్తున్నారు. ఇది కాదు, అది కాదు అని ఒక్కొక్కటి ఆలోచిస్తున్నారు. అప్పుడు భర్తతో భార్య అంది ‘‘ఏమండీ! ఐశ్వర్వంలో అందమూ ఒక భాగమే మనకి మూడు వరాలు ఉన్నాయి. నిజానికి మనిద్దరి ముక్కులు చాలా సొట్టగా, లోపలికి చొచ్చుకుపోయి అంద విహీనంగా ఉన్నాయి. కాబట్టి మొదటి వరంగా మనం మంచి ముక్కులు కోరుకుందాం’’ అంది భార్య. భర్త సరేనన్నాడు. భగవంతుడు చూస్తున్నాడు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరు మరొకరికి కనిపించేలా ఎదురెదురుగా ఉన్నారు. ‘‘స్వామీ! మా ముక్కులు మరీ అసహ్యంగా ఉన్నాయి. అంద విహీనంగా ఉన్నాయి.మాకు మంచి ముక్కులు ప్రసాదించండి స్వామీ!’’ అని కోరుకున్నారిద్దరూ. ‘ప్రాప్తిరస్తు’ అన్నాడు భగవంతుడు. అంతే... ఇద్దరి శరీరాల్లో పాదాల నుంచి శిరస్సు వరకు అందమైన ముక్కులు శరీరమంతా వచ్చేసాయి. ఒకళ్లనొకళ్లు చూసుకుంటున్నారు. ఎంత అందమైనవి అయినా శరీరమంతా ముక్కులు వచ్చేస్తే ఎలా ఉంటుంది? శరీరం యావత్తు ‘‘ముక్కుల’’మయం అయిపోతే ఎలా వుంటుంది? శిరస్సు నుంచి పాదాల వరకు ముక్కులతో మనుషులిద్దరూ పరమ అసహ్యంగా,మహా భయంకరంగా ఉన్నారు. చేసిన తప్పు ఇద్దరికీ అర్థమయ్యింది. భగవంతుడు అలా చూస్తూ అక్కడే ఉన్నాడు.
దంపతులు ఇద్దరూ జరిగిన తప్పు గ్రహించి నివారణోపాయం ఆలోచించేరు.్భర్య అంది భర్తతో ‘‘కంగారు పడకండి ఇంకా మనకి రెండు వరాలున్నాయి. మనం ఇలా చేద్దాం అని భర్తకి చెప్పింది. భర్తకి నచ్చింది. ‘‘స్వామీ! పెద్ద తప్పయిపోయింది. పొరపాటు జరిగింది. శరీరమంతా ముక్కులతో మహాభయంకరంగా ఉన్నాం.. ఈ ముక్కుల్ని తొలగించండి స్వామీ!’’ అని రెండో వరం కోరుకున్నారిద్దారూ. భగవంతుడు ‘శుభం’ అన్నాడు. ఒక్కసారిగా ఇద్దరి శరీరాల్లో ఉన్న అన్ని ముక్కులు మాయమైపోయేయి. వచ్చిన అన్ని ముక్కులతోపాటు మొదట్నుంచి ఉన్న ‘సొట్టముక్కు’ కూడా పోయింది.
అప్పుడు తెలిసొచ్చింది దంపతులిద్దరికీ సొట్టదో, లొత్తదో ఏదో ఒక ముక్కు లేకపోతే ఏమవుతుందో అర్థమయ్యింది. ఇద్దరికీ గాలి తీసుకునే అవకాశం లేక ఇద్దరూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. గిలగిలలాడుతున్నారు. ఆలోచించటానికి సమయం కాదది. ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి సిద్ధమవుతున్నాయి. మరో ఆలోచన అనేది లేకుండా దంపతులిద్దరూ ‘‘స్వామీ! మా ముక్కు మాకు ప్రసాదించండి’’ అని గిజగిజ గించుకుంటూ ఏదో ఒకలా తమ మూడోవరం కోరుకున్నారు దంపతులు. ‘ఇచ్చేను పో’ అన్నాడు భగవంతుడు. మళ్లీ దంపతులిద్దరికీ ముందు ఉన్న మొద్దు ముక్కు, సొట్టముక్కు, లొత్తలు పడ్డ ముక్కు వచ్చింది. మూడు వరాలు అయిపోయాయి కాబట్టి భగవంతుడు కూడా అదృశ్యమైపోయాడు.
చూసేరా! సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమై, ఒక్కటి గాదు మూడు వరాలిస్తాను, కోరుకోండి అని అభయమిస్తే వరాలు కోరుకోవటానికి ముందు, మూడు వరాలు కోరుకున్న తర్వాత, భగవంతుడు మూడు వరాలు ప్రసాదించిన తర్వాత ఒనగూరినదేమిటి? మిగిలింది ఏమిటి?? మిగిలింది ఆ సొట్ట ముక్కే!! అదే ఆశ్చర్యం!! అందుకే భగవంతుడ్ని కోరుకోవటమూ ఒక కళే. అది అర్థమవ్వాలంటే- ఆధ్యాత్మిక లోతులు తెలియాలి. తెలుసుండాలి.
***