మార్చి 2న దండుపాళ్యం 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండుపాళ్యం బ్యాచ్ అంటే సినిమా జనాల్లో క్రేజ్ వుంది. దండుపాళ్యం-1, దండుపాళ్యం-2 భారీ ఫెనింగ్స్‌తో సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు చివరి పార్టుగా దండుపాళ్యం-3 మార్చి 2న రానుంది. భిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండుపాళ్యం చిత్రాలు క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇదే ఊపులో దండుపాళ్యం-3 కూడా తెరకెక్కింది. శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సెనే్సషనల్ చిత్రం మరోసారి తెలుగు ప్రేక్షకులనుథ్రిల్ చేయనుంది. సాయికృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో, శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ మీసాల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫిబ్రవరి 25న భారీగా ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- దండుపాళ్యం సీరిస్‌లో వచ్చిన చిత్రాలన్నీ ఘనవిజయాలు సాధించాయి. ఈ సీరిస్‌లో భాగంగా ఆఖరి పార్ట్ దండుపాళ్యం-3 రూపొందించాం.