‘సత్యాగ్యాంగ్’ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాత్విక్ ఈశ్వర్, ప్రత్యూష్, హర్షిత ముఖ్యపాత్రల్లో ప్రభాస్ దర్శకత్వంలో సిద్ధయోగి క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ కన్నా నిర్మిస్తున్న చిత్రం ‘సత్యాగ్యాంగ్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చి 15న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేష్ కన్నా మాట్లాడుతూ- ఇటీవలే కర్నూలులో విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో సూపర్‌హిట్‌గా నిలవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సమాజంలో అనాథలే ఉండకూడదనే పాయింట్‌తో తెరకెక్కిస్తున్న సందేశాత్మక చిత్రమిది. హీరోగా పరిచయం అవుతున్న సాత్విక్ ఈశ్వర్‌కు మంచి భవిష్యత్తు వుంటుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మార్చి 15న విడుదల చేస్తామన్నారు. దర్శకుడు ప్రభాస్ మాట్లాడుతూ- పాటలు సక్సెస్ అయినందుకు ఆనందంగా వుంది. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం మా నిర్మాత వినోద్‌ఖన్నా. ప్రతి విషయంలో సపోర్టు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు.