బాలీవుడ్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లా మర్ హీరోయిన్ రెజీనాకు గత ఏడాది కాలంగా సరైన సక్సెస్ దక్కడంలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాకూడా పరాజయాలు పలకరిస్తూనే వున్నాయి. దాంతో కొత్త అవకాశాలు తగ్గాయి. ఇటీవలే నాని నిర్మించిన అ! సినిమాలో మాయ పాత్రలో నటించి ఆకట్టుకుంది. తాజాగా కోలీవుడ్‌లో కూడా ఒకే సినిమా చేస్తున్న ఈమెకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ దక్కింది. గతంలో కూడా బాలీవుడ్ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. తాజాగా ఈమెకు వచ్చిన అవకాశం చూస్తే నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే 3 ఇడియెట్స్, మున్నాభాయ్ ఎంబిబిఎస్ లాంటి చిత్రాలను నిర్మించిన విదు వినోద్ చోప్రా నిర్మిస్తున్న ‘ఏ లడకీకో దేఖాతో ఐసా లగా’ టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రంలో రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్‌ల తో కలిసి రెజీనా నటిస్తుందట.