సబ్ ఫీచర్

శ్రీచక్రమే శ్రీమాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చక్ర ఆవిర్భావం: ఉండేది బ్రహ్మమొక్కటే. ‘‘ఏకమేవాద్వితీయం బ్రహ్మ’’ ‘‘ఏకం సత్ విప్రా బహుదా వదంతి’’ అని ఆర్ష వాఙ్మయం చెబుతోంది. ఒకే సత్యాన్ని పండితులు అనేక పేర్లతో అనేక రూపాలుగా భావిస్తూ పిలుస్తూ వచ్చారు. ఈ బ్రహ్మము సత్, చిత్, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికీ, చేతనమను బీజమును తనయందే కలిగి ఉండుట దానిలోని విశేషము. అనగా ఒక సంకల్పము, ఒక స్పందన కలిగినదని అర్థము.
తంత్ర శాస్త్రం ప్రకారం కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘‘విమర్శ’’ (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికలవల్ల నాదము ఏర్పడినది. ఈప్రథమనాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది.
శ్రీవిద్యాపరముగా పరమేశ్వరుడు ప్రకాశ బిందు వనియు, పరమేశ్వరి, విమర్శ బిందువనియును ప్రకాశ బిందువు అద్దము వంటి విమర్శబిందువు (పరమేశ్వరి) యందు ప్రతిబింబమగుటచే మిశ్రమ బిందువేర్పడుచున్నదని భావించాలి. విశ్వ సృష్టియంతయు బిందువు నుండి ఆరంభమై క్రమముగా వ్యాప్తిని పొందింది. బిందువు నుండి మొదట ఆకాశముగ నేర్పడి నాదమును తన్మాత్రగా పొందియున్నది తదుపరి వాయు రూపమును పొంది ధ్వని, స్పర్శలను కలిగియున్నది. ఆ తరువాత జల రూపమును పొందినది. అప్పుడు, శబ్ధ స్పర్శ రూప రసములను పొందినది. తరువాత అందుండి పృథివీ రూపమును పొంది, శబ్ధ, స్పర్శ, రస, గంథములను గుణములను పొందినది. ఈ పంచభూతములే సర్వ జీవజాలమునకును మూలకారణమై యున్నవి. ఇట్లు కొన్ని యుగములైన తరువాత కల్పాంతము నందు సంహారక్రియ ఆరంభమై క్రమముగా సృష్టి వినాశనము పొందు బిందురూపమున నున్న పార్వతీ పరమేశ్వరుల యందు లీనమగును ఆ విధముగా ఈ సృష్టియంతయును శివశక్త్యాత్మకమై యున్నది.
ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే ‘‘పరాబిందువు’’ అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. నిజానికి యిది నిర్గుణమ, తేజోమయము, నామరూపములు లేనిది. దీనిని ఋతము, ఆత్మ, పరబ్రహ్మము, సచ్చిదానందము అను నామములతో వ్యవహరిస్తారు. ఈ బిందువే శ్రీ చక్రమునకు ఆధారము. ఈ పరాబిందువునందే సృష్టికి కావలిసిన శక్తి అంతయూ బీజప్రాయముగానున్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ)లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనబడినట్లు ఈ పరాబిందువునందు మూడు బిందువులేర్పడినవి. ఒకటి- శివ శక్తులొకటిగానున్న ‘బిందువు’, రెండు- అచేతనంగా ఉన్న ‘శివుడు’ మూడు- ‘చేతన స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము, త్రిపుటుల సమ్మేళనము, త్రిపురముర యొక్క స్థానమును అగు మొదటి త్రికోణము. పరబ్రహ్మము నుండి ప్రారంభమయ్యే ప్రతి అంశము కూడా అవిభాజ్యమైన, అవినాభావమైన శివశక్తుల సమ్మేళనమే. అందువల్లనే కాళిదాస మహాకవి ‘‘వాగర్ధావివ సంపోక్తౌ వాగర్థ ప్రతిప్రత్తయే జగతః ఫితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’ అని ప్రార్థించి వుండవచ్చు. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వర తత్వాన్ని సూచిస్తోంది. వాక్కునుండి అర్థము ఎట్లు విడదీయరానిదో ఆ రీతిగా ఉన్నారని భావన.

(ఇంకా ఉంది)

- డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590