మంచి మాట

‘తెర’ వెనుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటకం/నాటిక సంపూర్ణంగా పండాలంటే అందులో సమష్టి కృషి ఉంటుంది. ఒక దర్శకుడు, ఒక నటుడు, ఒక నటి, ఒక సంగీత దర్శకుడు... ఇలా... అంతా వారి వారి బాధ్యతల్లో నూటికి నూరుపాలు మమేకమైనప్పుడే ఫలితం చేతికందుతుంది. కాని, నాటకం ఇంతగా అందరినీ ఆకట్టుకోవాలంటే వీరే కాదు తెరవెనుక వాళ్లూ కావలసిందే.
నాటకం ప్రదర్శనలో పాత్రధారులు ప్రేక్షకులకు కనిపిస్తే, తెరవెనుక సూత్రధారులు దర్శనమివ్వరు. వారిని ప్రస్తావించేవారు తక్కువగా ఉంటారు. నటులకు అలంకరణ చేసేవారు, దుస్తులు ఎంపిక చేయడం వారిని ధరింపచేయడం, అంతేకాదు రంగస్థలాన్ని వేయబోయే నాటికకు అనుకూలమైన వాతావరణం, పరిస్థితులను కల్పించడం అంటే ఆషామాషిగాదు. నాటకంలోని నటుడు/నటి అభినయానికీ, ఆ పాత్రోచితంగా కదలికల నియమాలకు అనుగుణంగా రంగస్థల అలంకరణ ప్రధానం. నాటికలోని వాతావరణ పరిస్థితులు కల్పించాలంటే రంగస్థల అలంకరణ చేసేవారికి నాటిక గురించిన పూర్తి సమాచారం కావాల్సి ఉంటుంది. అపుడే ఆ రంగస్థలం వేయబోయే నాటికను పండిస్తుంది. అందుకే ఒక్క నటునివల్లో, దర్శకునివల్లో కాదు నాటిక పండించడానికి ఎంతమంది పని చేస్తారో వారందరి సమిష్టికృషినే నాటిక లేదా నాటకం ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది.