నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ పుండరీకాక్ష! నారెండు కన్నులనిండ
నిన్నుఁజూచెడి భాగ్యమెన్నడయ్య!
వాసిగా నామనోవాంఛ దీరెడునట్లు
సొగసుగా నీ రూపుఁ జూపవయ్య!
పాపకర్ముని కంటబడక పోవుదమంచుఁ
బరుషమైన ప్రతిజ్ఞ పట్టినావ?
వసుధలోఁ బతితపావనుఁడవీవంచునేఁ
ఋణ్యవంతుల నోటఁ బొగడవింటి

తే॥ నేమిటికి విస్తరించె నీకింత కీర్తి
ద్రోహినైనను నా కీవు దొరకకున్న?
భూషణ వికాస శ్రీ్ధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ ప్రభూ! నీవు తెల్లదామరల బోలిన కన్నులు గలవాడవు. నా కళ్లారా నిన్ను చూచే భాగ్యమెప్పుడు కల్గుతుంది? నా కోర్కె బాగా నెరవేరేటట్లు నీ రూపాన్ని నాకు చూపవా? ఈ పాపిష్ఠివాని కంట పడరాదని ఏమైనా ప్రతిజ్ఞ చేశావా? ఈ ప్రపంచంలో బాధితుల్ని కాపాడేవాడవు నీవేయని పుణ్యాత్ములు నిన్ను పొగడగా విన్నాను. నా వంటి పాపికి దొరకవు గదా! నీకింత పేరెట్లు వచ్చింది?