ఆంధ్రప్రదేశ్‌

అనంతలో కియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం/ విజయవాడ, ఫిబ్రవరి 21: దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన ప్రపంచ శ్రేణి కార్ల దిగ్గజ సంస్థ కియా భారతదేశంలో తొలిసారిగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కార్ల తయారీ కేంద్రం ప్రస్థానానికి తొలి అడుగు పడుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి (అమ్మవారిపల్లి) గ్రామంలో 44వ జాతీయ రహదారి పక్కన నెలకొల్పుతున్న కియా కంపెనీకి సంబంధించిన పనులకు సీఎం చంద్రబాబు బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా కియా కంపెనీ ఫ్రేమ్ ఇన్‌స్టలేషన్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.13వేల కోట్ల వ్యయంతో 600 ఎకరాల విస్తీర్ణంలో హూండయ్ సంస్థ అనుబంధంతో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల ఉత్పత్తి కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 13 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. 2017 జూన్‌లో కియా కంపెనీకి అవసరమైన భూమి పనులు మొదలయ్యాయి. 2019 ద్వితీయార్ధంలో కార్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏడాది సెప్టెంబర్ నాటికి తొలి కారు ఉత్పత్తి చేయడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏడాదికి దాదాపు 3 లక్షల కార్లు తయారు చేయాలన్నది కియా సంస్థ లక్ష్యం. అలాగే టౌన్‌షిప్, అనుబంధ సంస్థలు, శిక్షణ సంస్థ తదితరాలను మరో 1200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. కియాకు కేటాయించిన 600 ఎకరాల్లో దాదాపు 550 ఎకరాల్లో గ్రౌండ్‌వర్క్ పూర్తయింది. ఈ పనుల్ని ఎల్‌అండ్‌టీ కంపెనీ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తోంది. తొలుత తమిళనాడులో ఏర్పాటు చేయాలని భావించినా, సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును తీసుకుని దేశంలోనే రెండో అత్యంత కరవు జిల్లా అయిన అనంతపురంలో నెలకొల్పడానికి కృషి చేశారు. అంతకుముందే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ, చిత్తూరు, పెనుకొండలోని ఎర్రమంచి వద్ద భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో 10 మంది సభ్యులతో కూడిన 3 బృందాలు పరిశీలన చేశాయి. పెనుకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక ఈ కంపెనీకి రెవెన్యూశాఖ ద్వారా భూసేకరణ చేశారు. అదే సమయంలో బీహార్ రాష్ట్రానికి కియాను తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం కూడా సాగింది. బుధవారం నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ జీ.వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ టీ.రమామణి, స్థానిక ఆర్‌డీఓ రామ్మూర్తి, పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.

chitram...
కియా కంపెనీ కోసం నిర్మించిన షెడ్లు