తెలంగాణ

స్టార్టప్‌గా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టార్టప్ రాష్ట్రంగా ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ముగింపు సందర్భంగా నాస్కామ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. ఏ టెక్నాలజీ అయినా పేదలకు చేరినపుడే దానికి సార్ధకత ఏర్పడుతుందని, సరిహద్దుల్లోని సైనికులతోపాటు అందరికీ దాని ప్రయోజనాలు చేరాల్సి ఉందని అన్నారు. కొత్తగా వచ్చే ఏ టెక్నాలజీ అయినా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నిపుణులకు సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయ శాఖల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. టెక్నాలజీ సమర్థంగా వాడుకుంటే, ఎన్నో అద్భుతాలు చేయవచ్చన్నారు. భాతర్‌లో తొలిసారి టెలీ మెడిసిన్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించామని గుర్తు చేశారు. టీ ఫైబర్ నెట్‌వర్క్‌తో ఇళ్లు, స్కూళ్లు, పీహెచ్‌సీలను అనుసంథానం చేస్తామని వెల్లడించారు.
ఆరోగ్య రంగంలో అగ్రస్థానం
ఆరోగ్యరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కె తారకరామారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, గ్రామాలకూ నాణ్యమైన వైద్యాన్ని అందించగలుగుతున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలోనూ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించామని మంత్రి వెల్లడించారు. అలాగే, రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని ప్రపంచ కాంగ్రెస్‌కు హాజరైన నిపుణులకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సూచించారు. ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారని, భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం కలుగుతోందని అన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యగా మారిందని, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా చేయవచ్చని కేటీఆర్ అన్నారు.
పాఠశాలల డిజిటలైజేషన్ ప్రారంభం
రాష్ట్రంలో పాఠశాలల డిజిటలైజేషన్ ప్రారంభించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి రాష్ట్రంలో ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్ధులకు కంటి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతోందని ఉద్ఘాటించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సెక్టార్ కంపెనీలు కూడా సామాజిక బాధ్యత కింద ప్రజలకు సేవా కార్యక్రమాలు అమలు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఐటీ విస్తరణకు తోడ్పడుతున్న నాస్కామ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకోవడంపై కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇళ్లు, సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం అందించే టి-ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
chitram...
ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మూడోరోజు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐటీ మంత్రి కేటీఆర్