జాతీయ వార్తలు

కేసులు నమోదు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: మలయాళ నటి ప్రియాప్రకాశ్ వారియర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఒరు ఆదార్ లవ్ మలయాళ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రియా వారియర్, సినిమా దర్శక, నిర్మాతలపై తెలంగాణ, మహారాష్టల్ల్రో నమోదైన కేసులపై అత్యున్నత ధర్మాసనం స్టే ఇవ్వడంతోపాటు, దేశంలో ఎక్కడా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. మాణిక్య మలరాయ పూవి పాట తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రీకరణ జరిపారంటూ తెలంగాణ, మహారాష్టల్ల్రో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన కేసులను కొట్టివేయాలని, అలాగే తమపై క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రియావారియర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది హారీష్ బిరేన్ వాదనలు వినిపిస్తూ సినిమా ఇంకా విడుదల కాలేదని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలుంటే తిరస్కరించేందుకు అధికారం సన్సార్ బోర్డుకు ఉందని, ఈ సినిమా పాటపై కొందరు కావాలనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని వాదించారు. ఈ పాటపై పోలీసులు కేసును ఎలా నమోదు చేస్తారని వాదించారు. ఈ పాటపై కేరళలో ఎలాంటి కేసూ నమోదు కాలేదని, ఇతర రాష్ట్రాల్లో కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వాదనల అనంతరం చిత్ర బృందంపై వేసిన క్రిమినల్ కేసులపై స్టే విధిస్తూ నటి, దర్శకుడిపై దేశవ్యాప్తంగా ఎక్కడా క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సినిమాపై కేసులు నమోదు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర సమాధానం చెప్పాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రియ, అబ్దుల్ రహోఫ్ జంటగా నటించిన చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించారు. కాగా ఇటీవల ఈ సినిమాలో ముస్లిం మనోభావాలను కించపరిచే విధంగా ఓ పాట ఉందని హైదరాబాద్‌లోని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అలాగే మహారాష్టల్రో కూడా కేసు నమోదయింది.