క్రీడాభూమి

వరుణుడి ఆటంకం మహిళల నాలుగో టీ-20 రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 21: దక్షిణాఫ్రికా, భారత్ మహిళల క్రికెట్ టీ-20 ఇంటర్నేషనల్ నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇదే మైదానంలో పురుషుల మూడో టీ-20 మ్యాచ్ ఉండడంతో వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో ఆటను ఎంపైర్లు రద్దు చేశారు. మహిళల టీ-20 రద్దవడంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు మాత్రం నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌ను ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్ 2-1 ఆధిక్యంతో ఉంది. కానీ చిట్టచివరి మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే సిరీస్ మన వశం అవుతుంది లేదంటే డ్రాగా ముగుస్తుంది.
భారత్ టాస్ గెలిచి దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆతిధ్య జట్టు వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ లిజెల్సీ లీ 38 బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ డేన్ వాన్ నైకెర్క్ 47 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో రుమేలీ ధర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. క్లో ట్రెయాన్ నాలుగు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో రుమేలీ ధర్‌కు క్యాచ్ ఇచ్చింది. సునే లూస్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సహాయంతో ఐదు పరుగులు చేసి దీప్తి శర్మ చేతిలో ఎల్‌బీడబ్ల్యు అయింది. మిగ్‌నాన్ డు ప్రీజ్ రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. భారత జట్టులో దీప్తి శర్మ మూడు ఓవర్లలో 33 పరుగులిచ్చి రెండు వికెట్లు, పూనమ్ యాదవ్ మూడు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత విజయాలను అందుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ సేన మూడో టీ-20లో మాత్రం అతి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. ఆ మ్యాచ్‌లో 175. ఓవర్లలో కేవలం 133 పరుగులకే భారత్ కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 19 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. బుధవారం జరిగిన నాలుగో టీ-20 ఇరు జట్లకు ప్రతిష్ఠాత్మకమైనా వర్షం కారణంగా ఆటను రద్దు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఐదో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.